చందంపేట: విద్యుదాఘాతానికి గురై ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న మహిళ సోమవారం మృతిచెందింది. చందంపేట మండలం పొగిళ్ల గ్రామంలో ఈ నెల 20వ తేదీన హనుమాన్ ఊరేగింపు నిర్వహిస్తుండగా గ్రామానికే చెందిన జటావత్ లక్ష్మి(45) ప్రమాదవశాత్తు విద్యుదాఘాతానికి గురైంది. గ్రామస్తులు వెంటనే ఆమెను దేవరకొండ ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. అనంతరం మెరుగైన వైద్యం కోసం కుటుంబ సభ్యులు ఆమెను హైదరాబాద్‌లోని ఓ ప్రైవేట్ ఆస్పత్రికి తీసుకెళ్లగా చికిత్స పొందుతూ సోమవారం మృతి చెందింది. మృతురాలికి భర్త, ఇద్దరు కుమారులు, కుమార్తెలు ఉన్నారు. కూలీ పనిచేస్తూ జీవనం సాగించే లక్ష్మి కుటుంబాన్ని ప్రభుత్వం ఆదుకోవాలని గ్రామస్తులు కోరుతున్నారు.
Comments
Please login to add a commentAdd a comment