సమగ్ర సర్వేకు రెడీ..
భానుపురి (సూర్యాపేట) : జిల్లాలో సమగ్ర కుటుంబ సర్వేకు సర్వం సిద్ధమైంది. ప్రజల సామాజిక, ఆర్థిక, విద్య, ఉపాధి, రాజకీయ, కుల వివరాల సేకరణకు మూడు వారాల పాటు ఈ సర్వే కొసాగనుంది. దీనికి అవసరమైన సిబ్బంది ఎంపిక, శిక్షణను సైతం పూర్తి చేశారు. బుధవారం నుంచి మూడురోజుల పాటు ఎన్యూమరేటర్లు ఇళ్ల గుర్తింపు ప్రక్రియ చేపట్టనున్నారు. జిల్లా వ్యాప్తంగా దాదాపు 3.58 లక్షల ఇళ్లు ఉండనున్నట్లు అధికార యంత్రాంగం అంచనా వేస్తోంది.
మూడురోజుల పాటు..
సమగ్ర కుటుంబ సర్వే కోసం జిల్లాను 2,800 బ్లాక్‌లుగా విభజించి 2603 మంది ఎన్యూమరేటర్లను ఎంపిక చేశారు. ఈ ఎన్యూమరేటర్లు చేసిన సర్వేను పర్యవేక్షించేందుకు మరో 264 మంది సూపర్‌వైజర్లను సైతం నియమించారు. ఇప్పటికే ఈనెల 1వ తేదీ నుంచి శిక్షణ పొందిన ఎన్యూమరేటర్లు ఇళ్లను గుర్తించి జాబితాను సిద్ధం చేసే పనిలో నిమగ్నమయ్యారు. ఒక్కో ఎన్యూమరేటర్ 150 నుంచి 175 ఇళ్ల జాబితాను రూపొందించాల్సి ఉంది. అయితే మారిన షెడ్యూల్ ప్రకారం బుధవారం నుంచి మూడురోజుల పాటు కూడా ఈ ప్రక్రియ కొనసాగనుంది. ప్రభుత్వ ఆదేశాల తర్వాత ఈనెల 9వ తేదీ నుంచి 75 ప్రశ్నలతో కూడిన సమగ్ర కుటుంబ సర్వేను ఎన్యూమరేటర్లు చేపట్టనున్నారు.
ఏరోజుకారోజు ఆన్‌లైన్
ఒక్కో ఎన్యూమరేటర్‌కు సర్వే కోసం 150 నుంచి 175 ఇళ్లను కేటాయించనున్నారు. ఎన్యూమరేటర్లు తమకు కేటాయించిన ఇళ్లను మూడు వారాల్లో పూర్తి చేయాల్సి ఉంది. ఏ రోజుకారోజు సర్వేకు సంబంధించిన ఫారాలను సూపర్‌వైజర్‌కు అందిస్తే వాటిని మండల స్థాయిలో ఆన్‌లైన్ చేయనున్నారు.
అవగాహన కల్పిస్తేనే..
తెలంగాణ ప్రభుత్వం ఈ ఇంటింటి సమగ్ర సర్వేను ఎంతో ప్రతిష్టాత్మకంగా భావిస్తోంది. ప్రజల జీవన విధానం తెలియడంతో పాటు కుల గణన ఉండడంతో బీసీల లెక్క తేలనుంది. అయితే ప్రస్తుతం జిల్లాలో పత్తితీత పనులతో పాటు వరికోతలు, కొనుగోలు కేంద్రాల వద్దకు రైతుల రాకపోకలు సాగుతున్నాయి. ఈ నేపథ్యంలో సర్వే సిబ్బంది ఇళ్లకు వచ్చిన సమయంలో కుటుంబ సభ్యులు లేకపోతే మళ్లీ రావాల్సి ఉంది. ఇలా ఒక్కో ఇంటికి రెండు, మూడుసార్లు రావాల్సి ఉండడంతో సర్వే సిబ్బందికి ఇబ్బందులు కలగనున్నాయి. ఈ క్రమంలో జిల్లా ప్రజలకు ఈ సర్వేపై అధికార యంత్రాంగం అవగాహన కల్పిస్తే ప్రభుత్వ లక్ష్యం నెరవేరి సర్వే పకడ్బందీగా జరగనుంది.
ఫ నేటి నుంచి 8వతేదీ వరకు ఇళ్ల గుర్తింపు ప్రక్రియ
ఫ 9వతేదీ నుంచి 75 ప్రశ్నలతో
కుటుంబ సర్వే
ఫ మూడు వారాలపాటు కొనసాగనున్న ప్రక్రియ
ఫ సర్వే వివరాలు ఏరోజుకారోజు
ఆన్‌లైన్‌లో నమోదు
గ్రామ పంచాయతీలు 475
మున్సిపాలిటీలు 5
అధికారుల అంచనా
ప్రకారం ఇళ్లు 3.58 లక్షలు
ఎన్యూమరేటర్లు 2,603
ఎన్యూమరేటర్ బ్లాక్‌లు 2800
సూపర్‌వైజర్లు : 264
Comments
Please login to add a commentAdd a comment