డీఏలు, పెండింగ్ బిల్లులు విడుదల చేయాలి
సూర్యాపేట : ప్రభుత్వ ఉద్యోగ, ఉపాధ్యాయులకు డీఏలు, పెండింగ్లో ఉన్న బిల్లులను వెంటనే విడుదల చేయాలని టీపీయూఎస్ జిల్లా అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులు పర్వతం సంధ్యారాణి, యామా రమేశ్ డిమాండ్ చేశారు. ఉపాధ్యాయ, ఉద్యోగుల సమస్యల పరిష్కారంలో నిర్లక్ష్యంపై మంగళవారం సూర్యాపేట కలెక్టరేట్ ఎదుట టీపీయూఎస్ ఆధ్వర్యంలో ప్లకార్డు లతో నిరసన ప్రదర్శన నిర్వహించారు.ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ప్రభుత్వ ఉద్యోగ, ఉపాధ్యాయులకు నాలుగు డీఏలు బకాయి ఉన్నాయని, ఈ కుబేర్ లో జీపీఎఫ్ లోన్లు, పార్ట్ ఫైనల్ లు, సరెండర్ లీవ్ బిల్లులు, మెడికల్ రీయింబర్స్మెంట్ బిల్లులు పెండింగ్ లో ఉన్నాయన్నారు. పీఆర్సీ కమిటీ నివేదిక ప్రకటించి తక్షణమే అమలు చేయాలని కోరారు. ఈ కార్యక్రమంలో సంఘం రాష్ట్ర కార్యవర్గ సభ్యులు లింగంపల్లి హరిప్రసాద్, అమరవాది బ్రహ్మచారి, బైరు తిరుమలేశ్, నేరెళ్ల దేవరాజ్, మంచాల రవికుమార్, బాణోత్ పూల్సింగ్, రామినేని శ్రీనివాస్, నాగవెల్లి ప్రభాకర్, శ్రీనివాసరావు, సాయికుమార్, సురభి శ్రీధర్, వెంకట్ రెడ్డి, కోటిరెడ్డి , శ్రీనివాస్ రెడ్డి , శ్రీదేవి, జేజాల శ్రీదేవి, యమా సంతోష్ పాల్గొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment