16ఏళ్లుగా చాలీచాలని వేతనాలు
నూతనకల్: గ్రామీణ పేదరిక నిర్మూలన సంస్థ (సెర్ప్)లో పనిచేస్తున్న కంప్యూటర్ ఆపరేటర్లు, అకౌంటెంట్లు చాలీచాలని వేతనాలతో దుర్భర జీవితం గడుపుతున్నారు. ప్రభుత్వం మహిళా సంఘాలను బలోపేతం చేయడంతో పాటు ప్రభుత్వ సంక్షేమ పథకాలను అందించేందుకు మండల కేంద్రాల్లో సెర్ఫ్ కార్యాలయాలను ఏర్పాటు చేసింది. ఇందులో ఏపీఎం, సీసీలతో సహా అకౌంటెంట్, కంప్యూటర్ ఆపరేటర్‌లను నియమించింది. ఇందులో పనిచేసే ఏపీఎం, సీసీలతో పాటు సీఏలను గుర్తించిన ప్రభుత్వం అకౌంటెంట్లు, కంప్యూటర్ ఆపరేటర్లను విస్మరించింది. దీంతో చాలీచాలని వేతనాలతో కుటుంబ పోషణ భారంగా మారిందని, ఉద్యోగాలు క్రమబద్ధీకరించాలని వారు కోరుతున్నారు.
మొత్తం 17,505 సంఘాలు
జిల్లాలో మొత్తం 17,505 సంఘాలు ఉన్నాయి. మహిళా సాధికారత, గ్రామీణ స్థాయిలో పేదరిక నిర్మూలన మొదలగు ముఖ్యమైన పథకాల ఆర్థికపరమైన రికార్డులను నిర్వహిస్తున్నారు. కంప్యూటర్ ఆధారిత రిపోర్టులు, లబ్ధిదారుల వివరాలు, జీవనోపాధి వివరాలతో పాటు 21 రకాల సంక్షేమ కార్యక్రమాలను నిర్వహిస్తూ ఎప్పటికప్పుడు ఆన్‌లైన్‌లో పొందుపరుస్తారు. వరి ధాన్యం కొనుగోలు వివరాలు, రైతులకు పంట డబ్బుల చెల్లింపులు తదితర వివరాలన్ని ఆన్‌లైన్‌లో కంప్యూటర్ ఆపరేటర్‌లు నమోదు చేస్తారు. మండలానికి ఇద్దరు చొప్పున కంప్యూటర్ ఆపరేటర్లు 13 మంది, అకౌంటెంట్లు 23మంది పనిచేస్తున్నారు. వీరికి నెలకు రూ. 11500లు వేతనం పొందుతున్నారు. 16 సంవత్సరాలుగా పనిచేస్తున్నా ప్రభుత్వం వీరిని గుర్తించడం లేదు.
ఫ క్రమబద్ధీకరణకు నోచుకోని
సెర్ప్ ఉద్యోగులు
ఫ జిల్లా వ్యాప్తంగా 59మంది సిబ్బంది
Comments
Please login to add a commentAdd a comment