ప్రతి ఇంటా ఆనందాల దీపాలు వెలగాలి
● మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి
సూర్యాపేట : వెలుగుల పండుగ దీపావళి తెలుగువారి జీవితాల్లో వేల కాంతులు నింపాలని నీటి పారుదల, పౌర సరఫరాల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి ఆకాంక్షించారు. దీపావళి సందర్భంగా సూర్యాపేట జిల్లా ప్రజలకు మంత్రి శుభాకాంక్షలు తెలిపారు. చీకటి మీద వెలుగు, చెడు మీద మంచి, దుష్టశక్తుల మీద దైవశక్తి సాధించిన విజయానికి దీపావళి ప్రతీక అని పేర్కొన్నారు. దీపావళి సందర్భంగా ప్రజలందరికీ సకల శుభాలు, సంపదలు, సౌభాగ్యాలు, విజయాలు కలగాలని, ప్రజలందరి జీవితాలు శోభాయమానంగా వెలుగొందాలని, ప్రతి ఇంటా ఆనంద కాంతులు విరజిమ్మాలని ఆకాంక్షించారు.
కొత్త ఆశలు నింపాలి
భానుపురి (సూర్యాపేట): దీపావళి పర్వదినం జిల్లా ప్రజలందరి చీకట్లు తొలగించి, కొత్త ఆశలు నింపాలని కలెక్టర్ తేజస్ నంద్‌లాల్ పవార్ ఆకాంక్షించారు. గురువారం దీపావళి సందర్భంగా బుధవారం ఆయన జిల్లా ప్రజలకు పండుగ శుభాకాంక్షలు తెలిపారు. దీపావళి రోజున పిల్లలను జాగ్రత్తగా గమనించాలని, ఎక్కువ శబ్దాలు వెలుపరిచే టపాసులను కాల్చవద్దని సూచించారు.
బాధ్యతల స్వీకరణ
భానుపురి (సూర్యాపేట): అదనపు కలెక్టర్‌గా బదిలీపై వచ్చిన పి.రాంబాబు బుధవారం బాధ్యతలు స్వీకరించారు. జగిత్యాల అదనపు కలెక్టర్‌గా పనిచేస్తున్న ఈయన బదిలీపై ఇక్కడకు వచ్చారు. అదనపు కలెక్టర్‌గా పదవీ బాధ్యతలు చేపట్టిన పి.రాంబాబుకు జెడ్పీ సీఈఓ వి.అప్పారావు, డీపీఓ నారాయణరెడ్డి, కలెక్టర్ కార్యాలయ పాలనాధికారి సుదర్శన్‌రెడ్డితో పా టు అధికారులు, సిబ్బంది స్వాగతం పలికారు.
బాలలను బడిలో
చేర్పించాలి
చివ్వెంల(సూర్యాపేట): 14 సంవత్సరాలలోపు బాల బాలికలను బడిలో చేర్పించాలని జిల్లా న్యాయసేవాధికార సంస్థ కార్యదర్శి పి.శ్రీవాణి అన్నారు. నెల రోజుల పాటు నిర్వహించనున్న పాన్ ఇండియా రెస్క్యూ ఫర్ చైల్డ్ లేబర్ కార్యక్రమంలో భాగంగా బుధవారం చివ్వెంల పట్టణంలోని పలు హోటళ్లు, కారు మెకానిక్ షెడ్లను తనిఖీ చేశారు. ఈ సందర్భంగా రాజుగారి దాబా, వీరాచారి దాబా, ఎటుజెడ్ కార్ కేర్, భారత్ టైల్స్‌లను తనిఖీ చేసి, ఇద్దరు చైల్డ్ లేబర్స్‌ను గుర్తించారు. వారిని లేబర్ అధికారికి అప్పగించారు. కార్యక్రమంలో సూపరింటెండెంట్ పద్మజ ఉన్నారు.
తిరుమలగిరి మార్కెట్‌కు భారీగా ధాన్యం రాక
తిరుమలగిరి (తుంగతుర్తి): తిరుమలగిరి వ్యవసాయ మార్కెట్ యార్డుకు బుధవారం 15,956 బస్తాల ధాన్యం వచ్చినట్లు మార్కెట్ కార్యదర్శి శ్రీధర్ బుధవారం తెలిపారు. గరిష్టంగా క్వింటాకు 2109, కనిష్టంగా రూ.1906 ధర పలికినట్లు పేర్కొన్నారు.
మార్కెట్ యార్డుకు రెండు రోజులు సెలవు
తిరుమలగిరి వ్యవసాయ మార్కెట్ యార్డుకు గురువారం దీపావళి, శుక్రవారం అమావాస్య సందర్భంగా రెండు రోజులు సెలవు ప్రకటించినట్లు మార్కెట్ కార్యదర్శి తెలిపారు. తిరిగి నవంబర్ 2న తెరవనున్నట్లు పేర్కొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment