మత్స్య కార్మికుల సంక్షేమానికి కృషి
పెన్పహాడ్ : మత్య్స సహకార సంఘాల సంక్షేమానికి ప్రభుత్వం కృషి చేస్తోందని జిల్లా మత్య్సశాఖ అధికారి నాగులునాయక్ అన్నారు. మంగళవారం పెన్పహాడ్ మండల కేంద్రంలోని తహసీల్దార్ కార్యాలయంలో ఉచిత చేప పిల్లల పంపిణీ కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ఆయన పాల్గొని మత్య్సకారులకు చేప పిల్లలను పంపిణీ చేశారు. అనంతరం మాట్లాడుతూ మండలంలోని 8 గ్రామాల్లో 30 కుంటలకు 2లక్షల 89 వేల చేప పిల్లలను పంపిణీ చేసినట్లు తెలిపారు. కార్యక్రమంలో తహసీల్దార్ లాలునాయక్ సిబ్బంది మల్లికార్జున్, ఉపేందర్, సుమలత, రోజి, మత్స్య కార్మిక సంఘాల నాయకులు పాల్గొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment