విలువైన సేవలు అందించిన అదనపు కలెక్టర్
భానుపురి (సూర్యాపేట) : అదనపు కలెక్టర్‌గా బీఎస్ లత విలువైన సేవలు అందించారని కలెక్టర్ తేజస్ నంద్‌లాల్ పవార్ అన్నారు. జిల్లా అదనపు కలెక్టర్ (రెవెన్యూ) లత బదిలీపై జగిత్యాల జిల్లాకు వెళుతున్న సందర్భంగా మంగళవారం సాయంత్రం కలెక్టరేట్‌లోని సమావేశ మందిరంలో ఏర్పాటు చేసిన వీడ్కోలు కార్యక్రమంలో కలెక్టర్ మాట్లాడారు. లత జిల్లాలో ఎంపీ, ఎమ్మెల్సీ ఎన్నికలను సమర్థవంతంగా నిర్వహించారని అన్నారు. అదనపు కలెక్టర్ మాట్లాడుతూ అందరి సహకారంతో ఎన్నికలు సమర్థవంతంగా నిర్వహించామన్నారు. అనంతరం జిల్లా అధికారులు, రెవెన్యూ సిబ్బంది అదనపు కలెక్టర్ బీఎస్ లతను ఘనంగా సన్మానించారు. ఈ కార్యక్రమంలో ఆర్డీఓలు వేణుమాధవ్, శ్రీనివాసులు, సూర్యనారాయణ, సీపీఓ ఎల్.కిషన్, ఎస్సీ కార్పొరేషన్ ఏడీ శ్రీనివాస్‌నాయక్, కలెక్టరేట్ ఏఓ సుదర్శన్‌రెడ్డి, ఎలక్షన్ సూపరింటెండెంట్ శ్రీనివాసరాజు, డీటీ పద్మారావు, డీటీఓ రవికుమార్, డీఆర్‌డీఓ శిరీష, డీటీడీఓ శంకర్, డీఈఓ అశోక్‌కుమార్, ఎస్సీ అభివృద్ధి అధికారి లత, బీసీ అభివృద్ధి అధికారి అనసూయ, డీసీఓ పద్మ పాల్గొన్నారు.
సమగ్ర కుటుంబ సర్వేకు ఏర్పాట్లు చేయాలి
ఇంటింటి సమగ్ర కుటుంబ సర్వేకు విస్తృత ఏర్పాట్లు చేయాలని కలెక్టర్ తేజస్ నందులాల్ పవార్ సూచించారు. మంగళవారం కలెక్టరేట్‌లోని సమావేశ మందిరంలో సామాజిక, ఆర్థిక, విద్య, ఉపాధి, రాజకీయ, కుల సమగ్ర ఇంటింటి కుటుంబ సర్వేపై జిల్లా స్థాయిలో ట్రైనర్ ఆఫ్ ట్రైనర్స్‌కు, తహసీల్దార్లకు, ఎంపీడీఓలకు, ఏఎస్‌ఓలకు నిర్వహించిన శిక్షణ కార్యక్రమంలో కలెక్టర్ మాట్లాడారు.
ఫ కలెక్టర్ తేజస్ నంద్‌లాల్ పవార్
Comments
Please login to add a commentAdd a comment