రూ.8.33కోట్లు
మార్కెట్ల ఆదాయం..
తిరుమలగిరి (తుంగతుర్తి): వ్యవసాయ మార్కెట్లకు దండిగా ఆదాయం సమకూరింది. ఆరు వ్యవసాయ మార్కెట్లు ఉండగా ఇందులో సూర్యాపేట, కోదాడ, హుజూర్‌నగర్ సెలక్షన్ గ్రేడ్ మార్కెట్లుగా, తుంగతుర్తి స్పెషల్ గ్రేడ్ మార్కెట్‌గా, నేరేడుచర్ల గ్రేడ్–2, తిరుమలగిరి గ్రేడ్–3 మార్కెట్లుగా విభజించారు. అయితే 2024–25 ఆర్థిక సంవత్సరానికి సంబంధించి మొదటి ఆరు మాసాల్లో అంటే ఏప్రిల్ నుంచి సెప్టెంబర్ వరకు ప్రభుత్వం రూ.9.23 కోట్ల ఆర్థిక లక్ష్యాన్ని విధించించగా రూ.8.33 కోట్ల ఆదాయం చేకూరింది. మొత్తంగా 90.24 శాతం ఆదాయం వచ్చింది.
లక్ష్యాన్ని మించిన మూడు మార్కెట్లు
జిల్లాలోని ఆరు వ్యవసాయ మార్కెట్లలో సూర్యాపేట, తిరుమలగిరి, నేరేడుచర్ల మార్కెట్లు లక్ష్యాన్ని మించి ఆదాయాన్ని సమకూర్చుకున్నాయి. కోదాడ, హుజూర్‌నగర్ లక్ష్యానికి చేరువలో ఉండగా తుంగతుర్తి మార్కెట్ రూ.85 లక్షల ఆదాయానికి గాను కేవలం రూ.1.86 లక్షల ఆదాయాన్ని మాత్రమే సమకూర్చుకుని చివరి స్థానంలో ఉంది. గడిచిన వానాకాలంలో జిల్లాలో 5 లక్షలకుపైగా ఎకరాలలో వివిధ రకాల పంటలు సాగయ్యాయి. ఇందులో ఎక్కువగా వరి, పత్తి, కందులు, పెసర్లు సాగు చేశారు. కొనుగోలు కేంద్రాల్లో రైతులు విక్రయించిన ధాన్యం, పత్తికి సంబంధించిన మార్కెట్ ఫీజులు వసూలు చేయడంతో ఈ ఆదాయం వచ్చిందని అధికారుల లెక్కలు తేల్చాయి.
ఆరు వ్యవసాయ మార్కెట్లకు దండిగా ఆదాయం
ఫ లక్ష్యం రూ.9.23 కోట్లు..
వసూలు 90.24 శాతం
ఫ ఈ ఏడాది అర్ధవార్షికం
లెక్కలు తేల్చిన ప్రభుత్వం
ఫ మొదటి స్థానంలో సూర్యాపేట
ఫ వెనుకబడిన తుంగతుర్తి
ఆరునెలల ఆదాయ లక్ష్యాలు (రూ.లక్షల్లో..)
మార్కెట్ పేరు ఆర్థిక లక్ష్యం సమకూరింది
సూర్యాపేట 267.00 291.80
తిరుమలగిరి 85.00 130.75
నేరేడుచర్ల 100.46 105.90
కోదాడ 145.93 142.58
హుజూర్‌నగర్ 240.00 160.68
తుంగతుర్తి 85.00 1.86
వచ్చే ఆరు నెలల్లో మరింత ఆదాయం సమకూరుతుంది
వచ్చే ఆరు నెలల్లో మరింత ఆదాయం సమకూరనున్నది. వరి, పత్తితోపాటు వేరుశనగ, కందుల విక్రయాలు భారీగా జరగనున్నాయి. మార్కెట్లకు సమకూరిన ఆదాయంతో పాలక వర్గాలు చేసిన తీర్మానాలకు ఉన్నతాధికారుల నుంచి అనుమతులు పొంది రైతులకు అవసరమైన మౌలిక వసతులు కల్పిస్తాం.
– సంతోష్‌కుమార్,
జిల్లా వ్యవసాయ మార్కెటింగ్ అధికారి
Comments
Please login to add a commentAdd a comment