బుద్ధవనంలో స్టార్ హోటల్
నాగార్జునసాగర్ : రాష్ట్ర ప్రభుత్వ, ప్రైవేట్ భాగస్వామ్యంతో బుద్ధవనం పరిసరాల్లో స్టార్ హోటల్‌తోపాటు వాటర్ స్పోర్ట్స్ అభివృద్ధికి చర్యలు తీసుకుంటున్నట్లు రాష్ట్ర ఎకై ్సజ్, పర్యాటక శాఖమంత్రి జూపల్లి కృష్ణారావు తెలిపారు. శుక్రవారం ఆయన నాగార్జునసాగర్ జలాశయతీరంలో నిర్మితమైన బుద్ధవనాన్ని శ్రీరామచంద్రమిషన్ వ్యవస్థాపక అధ్యక్షుడు కమలేష్ డి.పాటిల్(దాజి), స్థానిక ఎమ్మెల్యే కుందూరు జైవీర్‌రెడ్డితో కలిసి పరిశీలించారు. ముందుగా విజయవిహార్‌కు వచ్చిన మంత్రికి.. ఎమ్మెల్యే జైవీర్‌రెడ్డి పుష్పగుచ్ఛం అందజేసి స్వాగతం పలికారు. అనంతరం మంత్రి విజయవిహార్‌లో అధికారులతో సమావేశం నిర్వహించారు. బుద్ధవనం, విజయవిహార్ లే ఔట్లను పరిశీలించారు. మొత్తం 270 ఎకరాల విస్తీర్ణంలోని బుద్ధవనం విశేషాలను రాష్ట్ర పర్యాటక అభివృద్ధి సంస్థ ఎండీ ప్రకాశ్‌రెడ్డి, బుద్ధవనం కన్సల్టెంట్ శివనాగిరెడ్డి.. మంత్రి, దాజికి వివరించారు. బుద్ధవనం సందర్శనకు ఆసియా ఖండంలోని పలు దేశాల నుంచి బౌద్ధులు రానున్నారని, వారు బస చేసేందుకు సకల సౌకర్యాలతో హోటల్ నిర్మించాల్సిన అవసరం ఉందన్నారు. అందుకోసం నాగార్జునసాగర్ చుట్టు పక్కలగల ప్రభుత్వ భూములపై సర్వే నిర్వహించి వివరాలు అందజేయాలని మిర్యాలగూడ సబ్‌కలెక్టర్ అమిత్ నారాయణ్‌ను ఆదేశించారు.
ప్రపంచ పర్యాటక కేంద్రంగా సాగర్ : ఎమ్మెల్యే
నాగార్జునసాగర్‌ను ప్రపంచ పర్యాటక కేంద్రంగా అభివృద్ధి చెందుతోందని సాగర్ ఎమ్మెల్యే కుందూరు జైవీర్‌రెడ్డి తెలిపారు. బుద్ధవనం సందర్శన అనంతరం ఆయన విలేకరులతో మాట్లాడారు. కొండలు, గుట్టలతో కూడిన పరిసరాలు, కృష్ణానది తీరం, నీటి సౌకర్యం ఉందని హైదరాబాద్‌కు అతిసమీపంలో ఉన్నందున స్టార్ హోటల్‌తో పాటు అన్ని వర్గాల ప్రజలకు అందుబాటులో ఉండేవిదంగా కాటేజీల నిర్మాణం చేయాల్సిన ఆవశ్యకత ఉందని తెలిపారు. కార్యక్రమంలో రాష్ట్ర పర్యాటక అభివృద్ధిసంస్థ ఓఎస్‌డీ సూధన్‌రెడ్డి, బుద్ధవనం డిజైనర్ శ్యాంసుందర్, సబ్‌కలెక్టర్ అమిత్ నారాయణ్, ఏఎస్పీ రాములునాయక్, రాజేంద్రప్రసాద్ తదితరులు ఉన్నారు.
ఫ రాష్ట్ర పర్యాటకశాఖ
మంత్రి జూపల్లి కృష్ణారావు
Comments
Please login to add a commentAdd a comment