గ్రామీణుల నిరసన | Sakshi
Sakshi News home page

గ్రామీణుల నిరసన

Published Fri, May 10 2024 6:25 PM

గ్రామీణుల నిరసన

తిరుత్తణి: పోరంబోకు స్థలం ఆక్రమణకు నిరసనగా గ్రామస్తులు బుధవారం రాస్తారోకో చేపట్టారు. వివరాలు.. తిరువలంగాడు యూనియన్‌ చివ్వాడ గ్రామ పంచాయతీలోని మేట్టు కాలనీలో వందకు పైబడిన కుటుంబాలు నివాసం ఉంటున్నాయి. గ్రామ పరిధిలోని ప్రభుత్వ పోరంబోకు స్థలం అదే గ్రామానికి చెందిన వ్యక్తి ఆక్రమించినట్లు, ఆ స్థలం ప్రభుత్వం స్వాధీనం చేసి ఇళ్లు లేని నిరుపేద దళితులకు పంపిణీ చేయాలనే డిమాండ్‌తో గ్రామానికి చెందిన మహిళలు చివ్వాడ తిరుత్తణి రోడ్డు మార్గంలో బైఠాయించి రాస్తారోకో చేపట్టారు.ఆ మార్గంలో వాహన రాకపోకలు స్తంభించడంతో పోలీసులతో పాటు తిరుత్తణి తహసీల్దారు మదియళగన్‌ గ్రామానికి చేరుకుని నిరసన కారులతో చర్చలు చర్చించారు. నిరుపేదలకు ఉచిత ఇంటి పట్టాలు అందజేస్తామని హామీ ఇవ్వడంతో ఆందోళనకారులు రాస్తా రోకో విరమించారు. అనంతరం గ్రామస్తుల డి మాండ్‌ మేరకు తహసీల్దారు మదియళగన్‌ ఆధ్వ ర్యంలో గురువారం రెవెన్యూ శాఖ అధికారులు చివ్వాడ గ్రామంలో హెచ్చరిక బోర్డు ఏర్పాటు చేశారు. ప్రభుత్వ స్థలం ఆక్రమిస్తే కఠిన చర్యలు తీసుకుంటామని అందులో స్పష్టం చేశారు.

Advertisement
 
Advertisement