ఘనంగా ‘దేవర్’ గురు పూజోత్సవం
త్యాగులకు గౌరవం..
సీఎం స్టాలిన్ మీడియాతో మాట్లాడుతూ, త్యాగులకు గుర్తింపు ఇస్తూ, గౌరవాన్ని కల్పిస్తున్న ప్రభుత్వం తమదేనని వ్యాఖ్యలు చేశారు. దేవర్ సేవలు, ఖ్యాతిని గుర్తు చేస్తూ, పసుంపొన్‌లో భక్తుల కోసం ప్రత్యేక ఏర్పాట్లు చేశామని వివరించారు. ఆయన కీర్తి అజరామరం అని వ్యాఖ్యలు చేశారు. ఈ సందర్భంగా తమిళ జాలర్లపై జరుగుతున్న దాడుల గురించి ప్రస్తావించగా, కేంద్రంపై తాము ఒత్తిడి తీసుకు రావడంతో కొందరిని విడుదల చేస్తూ వస్తున్నారని గుర్తు చేశారు. ఈ దాడుల సమస్యకు శాశ్వత పరిష్కారం దిశగా ప్రయత్నాలు చేస్తున్నామన్నారు. కావేరి – గుండారు నదుల అనుసంధానం ప్రాజెక్టు పనులు 40 శాతం ముగిసినట్టు పేర్కొన్నారు. కాగా పళని స్వామి మీడియాతో మాట్లాడుతూ, వీరత్వం, వివేకం, నిరాడంబరతకు ప్రతిరూపం దేవర్ అని కొనియాడారు. అలాగే తమిళగ వెట్రి కళగం అధ్యక్షుడు విజయ్, చిన్నమ్మ శశికళ వేర్వేరు ప్రకటనల్లో దేవర్ కీర్తిని కొనియాడుతూ నివాళులర్పించారు.
● కౌముదిలో సీఎం సహా నేతల అంజలి
● ఊరేగింపులు...ర్యాలీలు చేపట్టిన సామాజిక వర్గం నేతలు
● నందనంలో పరిసరాలు కిటకిట
సాక్షి, చైన్నె: పసుంపొన్ ముత్తు రామలింగం దేవర్ 111వ జయంతి, 62వ గురుపూజోత్సవం బుధవారం రాష్ట్రంలో వాడవాలా ఘనంగా జరిగింది. దేవర్ సా మాజిక వర్గ ప్రజలు ఈ వేడుకను కోలాహలంగా జ రుపుకున్నారు. రామనాథపురం జిల్లా కౌముదిలోని ఆ యన స్మారక మందిరంలో సీఎం ఎంకే స్టాలిన్‌తో పా టు మంత్రులు నివాళులర్పించారు. అన్నాడీఎంకే ప్ర ధాన కార్యదర్శి పళణి స్వామి అంజలి ఘటించారు. వి వరాలు.. రాష్ట్రంలోని దక్షిణాది జిల్లాలలో అత్యధిక జ నాభా కలిగిన ముక్కుళత్తూరు సామాజిక వర్గ ప్రజల ఆరాధ్యుడే కాదు..ఆధ్యాత్మిక రాజకీయవేత్తగా పసుంపొన్ ముత్తు రామలింగ దేవర్ అందరికీ సుపరిచితు లే. ఆయన జయంతి, వర్ధంతి ఒకే రోజు కావడంతో గురు పూజోత్సవంగా వేడుకలను మూడు రోజుల పా టు ఆ సామాజిక వర్గం జరుపుకోవడం ఆనవాయితీ గా వస్తోంది. తొలిరోజు ఆధ్యాత్మిక వేడుకగా, రెండో రోజు లక్షార్చన వేడుక జరుపుకున్నారు. ఇక బుధవా రం అత్యంత కట్టుదిట్టమైన భద్రత నడుమ రామనాథపురం, విరుదునగర్, తెన్‌కాశి, తిరునల్వేలి, తేని, మ దురై, శివగంగై, తిరుచ్చి, పుదుకోట్టై తదితర జిల్లాలో గురుపూజోత్సవం వేడుకగా జరిగింది. పలుచోట్ల ర్యా లీల రూపంలో వేడుకలు హోరెత్తాయి. తమ సంక్షేమం కోసం శ్రమించి అమరుడైన దేవర్‌కు ముక్కుళత్తూరు సామాజిక వర్గం ఘన నివాళులర్పించాయి. ఆ సామాజిక వర్గానికి చెందిన ప్రజలతో పాటు రాజకీయ పక్షాల నేతృత్వంలో పాల బిందెలతో ఊరేగింపులు, కాగడా చేత బట్టి జ్యోతి ర్యాలీలు జరిగాయి. వాడవాడలా ఆయన విగ్రహానికి పూల మాలలు వేసి నివాళులర్పించారు. అన్నదానాలు, రక్తదానాలు వంటి సేవా కార్యక్రమాల్ని నిర్వహించారు.
కౌముదిలో సంబరం..
రామనాథపురం జిల్లా కౌముదిలోని ముత్తురామలింగం దేవర్ స్మారక ప్రదేశంలో అత్యంత వేడుకగా గురుపూజోత్సవం జరిగింది. వేకువ జాము నుంచే ప్రత్యేక పూజల్ని నిర్వహించారు. హోమాది కార్యక్రమాలతో, ఆ స్మారక ప్రదేశాన్ని పాలాభిషేకంతో ముంచెత్తారు. వేడుక కమిటీ నేతృత్వంలో ఆ కేంద్రాన్ని పుష్పాలతో అలంకరించారు. బంగారు తాపడాన్ని దేవర్ విగ్రహానికి సమర్పించారు. రాష్ట్ర ముఖ్యమంత్రి ఎంకే స్టాలిన్, మంత్రులు మూర్తి, తంగం తెన్నరసు, కేకేఎస్‌ఎస్‌ఆర్ రామచంద్రన్, రాజకన్నప్పన్, పెరియకరుప్పన్, పళణి వేల్ త్యాగరాజన్ తదితరులతో పాటు ఆ పార్టీ ఎంపీలు, ఎమ్మెల్యేలు పెద్దసంఖ్యలో తరలి వచ్చి అంజలి ఘటించారు. ఇటీవల అక్కడ నిర్మించిన అరంగం, భక్తుల కోసం చేసిన ఏర్పాట్లను సీఎం స్టాలిన్ పరిశీలించారు. అనంతరం అన్నాడీఎంకే ప్రధాన కార్యదర్శి పళణిస్వామి పసుంపొన్ ముత్తురామలింగ దేవర్ స్మారకం వద్ద అంజలి ఘటించారు. కర్పూర హారతి పట్టి నివాళులర్పించారు. ఆయనతో పాటు మాజీ మంత్రులు, సీనియర్ నేతలు దిండుగల్ శ్రీనివాసన్, సెల్లూరు రాజు, నత్తం విశ్వనాథ్, ఆర్‌బీ ఉదయకుమార్, కామరాజర్, ప్రిసీడియం చైర్మన్ తమిళ్ మగన్‌హుస్సేన్, విజయ భాస్కర్ తదితరులు ఉన్నారు. ఆ తర్వాత మాజీ సీఎం పన్నీరుసెల్వం తో పాటు ఆయన మద్దతుదారులు నివాళులర్పించారు. ముందుగా మదురై విమానాశ్రయం నుంచి రామనాథపురానికి వచ్చే క్రమంలో గోరిపాళయంలోని దేవర్ నిలువెత్తు విగ్రహాన్ని సీఎం స్టాలిన్, అన్నాడీఎంకే ప్రధాన కార్యదర్శి పళణి స్వామిలు వేర్వేరుగా నివాళులర్పించారు. ఉదయం నుంచి రాత్రి వరకు జన సందోహం తండోపతండాలుగా స్మారక ప్రదేశానికి తరలి వచ్చారు. అధికారులు భద్రతను కట్టుదిట్టం చేసి పర్యవేక్షించారు.
చైన్నెలో..
గిండి రాజ్ భవన్‌లో గవర్నర్ ఆర్‌ఎన్ రవి దేవర్ చిత్ర పటానికి పుష్పాంజలి ఘటించారు. చైన్నె అన్నాసాలైలోని నందనం సిగ్నల్ వద్ద ఉన్న దేవర్ విగ్రహాన్ని పలు రకాల పువ్వులతో సుందరంగా అలంకరించారు. ఇక్కడ నిలువెత్తు చిత్ర పటాన్ని ఏర్పాటు చేశారు. పెద్దసంఖ్యలో ఆయా పార్టీ నాయకులు తరలి వచ్చి పుష్పాంజలి ఘటించారు. పూల మాలలు వేసి నివాళులర్పించారు. రాష్ట్ర ప్రభుత్వం తరపున మంత్రులు సుబ్రమణియన్, శేఖర్‌బాబు, రఘుపతి, అన్బరసన్, ఎంపీ టీఆర్ బాలు, తమిళచ్చి తంగపాండియన్, మేయర్ ప్రియ, మాజీ గవర్నర్ తమిళిసై సౌందరరాజన్, అన్నాడీఎంకే నేతలు జయకుమార్, పొన్నయ్యన్, గోకుల ఇందిరా, టీఎన్‌సీసీ అధ్యక్షుడు సెల్వ పెరుంతొగై, తమిళ మానిల కాంగ్రెస్ నేత జికే వాసన్, జీఆర్ వెంకటేష్ తదితరులు వేర్వేరుగా అంజలి ఘటించిన వారిలో ఉన్నారు. అన్నాడీఎంకే నేతృత్వంలో అన్నదాన కార్యక్రమం జరిగింది.
Comments
Please login to add a commentAdd a comment