మదురై వరద నష్టంపై సీఎం సమీక్ష
● సెల్లూరు కన్మాయి కెనాల్ పనులకు రూ.11.9 కోట్లు కేటాయింపు ● సహాయక చర్యల్లో అధికారుల పనితీరును కొనియాడిన స్టాలిన్ ● అప్రమత్తంగా ఉండాలని సూచన
సాక్షి, చైన్నె: రెండు రోజుల క్రితం మదురైను వర్షాలు ముంచెత్తిన నేపథ్యంలో బుధవారం నష్టం తీవ్రతపై సీఎం స్టాలిన్ సమీక్షించారు. దేవర్‌స్మారకం సందర్శనకు ముందుగా మదురైలో సీఎం స్టాలిన్ పర్యటించారు. మంత్రులు మూర్తి, పళణి వేల్ త్యాగరాజన్, కలెక్టర్, ఎంపీ, ఎమ్మెల్యేలు, ఇతర అధికారులతో సమావేశమయ్యారు. మదురై వరద పరిస్థితిని అధ్యయనం చేశారు. హఠాత్తుగా కురిసిన భారీ వర్షానికి మధురై అతలాకుతల మైనట్టు అధికారులు వివరించారు. ప్రధానంగా సెల్లూరు ప్రాంతం అక్కడి కన్మాయి (అతిపెద్ద చెరువు) రూపంలో నీట మునగాల్సి వచ్చిందని, ఇలాంటి నష్టం మళ్లీ ఎదురు కాకుండా ఈ కన్మాయి పరిసరాలలో 290 మీటర్ల మేరకు పొడవైన కాలువ నిర్మాణం అవశ్యమని వివరించారు. సెల్లూరు కెనాల్‌లో నీరు వెళ్లేందుకు వీలుగా తక్షణం రూ. 11.9 కోట్లను కేటాయించారు. త్వరితగతిన పనులు చేపట్టాలని ఆదేశించారు. లోతట్టు ప్రాంతాలలో ఆగమేఘాలపై సహాయక చర్యలు విస్తృతం చేశామని పేర్కొన్నారు. ప్రజలకు తీవ్ర నష్టం ఎదురు కాకుండా ముందు జాగ్రత్తలు తీసుకోవడం దోహదకరంగా మారినట్లు అధికారులు వివరించారు. సకాలంలో మంత్రుల బృందం సూచనలతో అన్ని సహాయక చర్యలను విజయవంతం చేశామని పేర్కొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment