‘చైన్నె‘లో గ్రాండ్ మాస్టర్స్ చెస్ ఛాంపియన్‌షిప్
● నవంబర్ 5 నుంచి 11 వరకు నిర్వహణ ● వేదికగా అన్నా శత జయంతి స్మారక గ్రంథాలయం
సాక్షి, చైన్నె: తమిళనాడు స్పోర్ట్స్ డెవలప్‌మెంట్ అథారి టీ నేతృత్వంలో అంతర్జాతీయ, భారతీయ గ్రాండ్ మా స్టర్లతో చైన్నె వేదికగా చైన్నె గ్రాండ్ మాస్టర్స్ చెస్ ఛాంపియన్ షిప్ – 2024 పోటీలు జరగనున్నాయి. 2వ ఎ డిషన్‌గా ఈ పోటీలు అన్నా సెంటినరీ లైబ్రరీలో నవంబర్ 5 నుంచి 11వ తేదీ వరకు నిర్వహించనున్నారు. పోటీ మొత్తం ప్రైజ్ మనీగా రూ. 70 లక్షలు తమిళనా డు ప్రభుత్వం అందించనుంది. ఈ టోర్నీ 7 రౌండ్లతో రౌండ్ రాబిన్ ఫార్మాట్‌లో ఉంటుందని ప్రక టించారు. ఈ పోటీలో భారతదేశానికి చెందిన అర్జున్, తమిళనాడుకు చెందిన అరవింద్ చిదంబరం, లెవాన్ ఆరోన్స్‌తో సహా 8 మంది అంతర్జాతీయ భారతీయ ఆట గాళ్లు పాల్గొననున్నారు. గత సంత్సరం చైన్నెలో జరిగిన గ్రాండ్ మాస్టర్స్ టోర్నీలో డి.గుకేష్ సాధించిన విజయం క్యాండిడేట్స్ చెస్ టోర్నీకి అర్హత సాధించడంలో దోహద పడడం గమనార్హం. ప్రపంచ ఛాంపియన్‌గా ఎదగడంలో గుకేష్ తొలి అడుగు ఈ టోర్నీగా చెప్పవచ్చు. ఈ ఏ డాది చైన్నె గ్రాండ్ టోర్నీలో భారత చెస్ ప్లేయర్ అర్జు న్ కూడా మాస్టర్స్‌లో పాల్గొంటున్నాడు. ఇతను కూడా ఛాంపియన్ షిప్‌కు అర్హత సాధించే అవకాశం ఉందని భావిస్తున్నారు. ఈ సంవత్సరం, చైన్నె గ్రాండ్‌మాస్టర్ – ఛాలెంజర్స్ టోర్నమెంట్, మాస్టర్స్ పోటీ కూడా ఏక కాలంలో నిర్వహించనున్నారు. తమిళనాడుకు చెందిన కార్తికేయ మురళి, వి.ప్రణవ్, ఎం.ప్రాణేష్, ఆర్.వైశాలి గ్రాండ్‌మాస్టర్స్ భాగస్వామ్యంతో రౌండ్ రాబిన్ ఫార్మాట్‌లో 7రౌండ్లు క్లాసికల్ చెస్ ఆడనున్నారు. మాస్టర్స్ వి భాగంలో విజేతలకు రూ.15లక్షలు, ఛాలెంజర్స్ విభా గంలో విజేతలకు రూ.6 లక్షలు అందించనున్నారు.
Comments
Please login to add a commentAdd a comment