సాక్షి, చైన్నె : గెలిస్తే అధికారంలో వాటా అంటూ తమిళ వెట్రి కళగం అధ్యక్షుడు విజయ్ చేసిన వ్యాఖ్యలపై పలువురు నేతలు స్పందిస్తూనే ఉన్నా రు. తాజాగా వీసీకే నేత, ఎంపీ తిరుమావళవన్ బుధవారం స్పందిస్తూ, కూటమి, అధికారం అన్న ప్రకటనలు ఇప్పుడే విజయ్ చేయకుండా ఉండాల్సింది అన్నారు. ఇంకా ఎన్నిలకు ఏడాదిన్నర కా లం సమయం ఉందన్న విషయాన్ని గుర్తెరిగి ఉండాలన్నారు. ఈ కాలం రాష్ట్రంలో డీఎంకే పాలన సాగాల్సి ఉందన్నారు. కూటమి, చర్చ, వాటా అ న్న అంశాలపై గోప్యత పాటించి ఉండాల్సిందని, ఇవన్నీ రహస్య మంతనాలతో జరగాల్సిన తంతు గా పేర్కొన్నారు. ఒక్కో పార్టీని పిలిపించి, ఒక్కో పార్టీకి ఎన్ని సీట్లు, అభ్యర్థి ఎవరో అన్న చర్చలతో నిర్ణయాలు తీసుకోవాల్సి ఉంటుందన్నారు. ఇప్పుడు ఈ ప్రకటన చేయడం వెనుక కేవలం డీఎంకే కూటమిలో గందరగోళం సృష్టించడమే లక్ష్యంగా పెట్టుకున్నట్టుందని వ్యాఖ్యానించారు. అలాగే, డీఎంకే కూటమిలోని ఎండీఎంకే నేత, ఎంపీ దురై వైగో పేర్కొంటూ అధికారంలో వాటా అన్నది గందరగోళం తప్ప మరేమీ లేదని ఎద్దేవా చేశారు. నామ్ తమిళర్ కట్చి నేత సీమాన్ స్పందిస్తూ, విజయ్ అభిమానులు ఎక్కువ మంది తనకే మద్దతుగా ఉన్నారని, వారి ఓట్లన్నీ తన పార్టీకే అని ధీమా వ్యక్తం చేశారు.
సేవా గృహాలు, హాస్టళ్లకు లైసెన్స్ తప్పనిసరి
కొరుక్కుపేట: చైన్నెలో పలుచోట్ల బాలల గృహాలు, వృద్ధాశ్రమాలు, మెంటల్లీ రిటార్డెడ్ హోమ్‌లు, దివ్యాంగుల గృహాలు, మాదకద్రవ్యాల బానిసల పునరావాస గృహాలు, మహిళలు, పిల్లల కోసం వసతి గృహాలు, మానసిక రోగుల కోసం గృహాలు పనిచేస్తున్నాయి. అటువంటి గృహాలన్నీ తప్పనిసరిగా రిజిస్ట్రేషన్, లైసెన్సింగ్ చట్టాలకు అనుగుణంగా పేర్లు నమోదు చేసుకోవాలి. ఈమేరకు రిజిస్ట్రేషన్ లేకుండా నిర్వహించబడుతున్న సేవా గృహాలు, వసతి గృహాలు వెబ్‌సైట్‌లో లేదా కార్యాలయంలో తగిన పద్ధతిలో రిజిస్ట్రేషన్ కోసం దరఖాస్తు చేసుకోవడానికి నెల వ్యవధి ఇచ్చారు. కాగా ఈ ఏడాది నవంబర్ చివరి నాటికి దరఖాస్తు చేయడంలో విఫలమైతే తగిన చర్యలు తీసుకుని ఆ ఇళ్లకు సీల్ వేస్తామని చైన్నె జిల్లా కలెక్టర్ రష్మీ సిద్ధార్థ్ తెలిపారు.
రవాణా సంస్థల్లో 2,877 పోస్టుల భర్తీకి ఆదేశం
కొరుక్కుపేట: రవాణా సంస్థల్లో ఖాళీగా ఉన్న 2,877 పోస్టుల భర్తీకి ఉత్తర్వులు వెలువడ్డాయి. తమిళనాడు ప్రభుత్వ విభాగంలో ఎనిమిది ప్రభుత్వ రవాణా సంస్థలు పనిచేస్తున్నాయి. ఈ రవాణా సంస్థల్లో దాదాపు 1.11 లక్షల మంది ఉద్యోగులు పనిచేస్తున్నారు. ప్రభుత్వ రవాణా సంస్థల్లో ఖాళీగా ఉన్న పోస్టులను రవాణా శాఖ బర్తీ చేస్తోంది. ఆవిధంగా ఖాళీగా ఉన్న 2,877 పోస్టుల భర్తీకి రవాణాశాఖ ఉత్తర్వులు జారీ చేసింది. ఈ మేరకు రవాణా శాఖ కార్యదర్శి ఫణీంద్రరెడ్డి వెల్లడించారు. తమిళనాడు ప్రభుత్వం ఖాళీగా ఉన్న 2,340 డ్రైవర్, కండెక్టర్ సిబ్బంది, 537 టెక్నికల్ సిబ్బంది డ్రైవర్, కండక్టర్ల విధులను నిర్వహించే పోస్టులను భర్తీ చేయడానికి ఉత్తర్వులు జారీ చేసిందన్నారు. షెడ్యూల్డ్, షెడ్యూల్డ్ తెగలకు 307 ఆపరేటర్లు, కండక్టర్లు, 462 సాంకేతిక సిబ్బంది సహా మొత్తం 769 ఖాళీలు కేటాయించారు. మిగిలిన 2,108 పోస్టులు ఇతర కేటగిరీలకు రిజర్వ్ చేశామన్నారు.
అన్నా వర్సిటీ మాజీ వీసీ కేసు 6 నెలల్లో పూర్తి చేయాలి
కొరుక్కుపేట: అన్నా యూనివర్సిటీ మాజీ వైస్–చాన్స్‌లర్ కాళీరాజ్ పై వచ్చిన ఆదాయనికి మించిన ఆస్తుల కేసును విచారణను ఆరు నెలల్లోగా పూర్తి చేయాలని చైన్నె హైకోర్టు అవినీతి నిరోధక శాఖను ఆదేశించింది. కాళీరాజ్ 2012–2013 వరకు, అలాగే 2019 నుంచి 2022 వరకు చైన్నెలోని అన్నా విశ్వవిద్యాలయంలో వైస్–చాన్స్‌లర్‌గా పనిచేశారు. ఆదాయానికి మించిన ఆస్తులున్నాయని మాణికం అనే వ్యక్తి గత జూలైలో లంచాల నిరోధక శాఖలో ఫిర్యాదు చేశారు. ఫిర్యాదుపై విచారణ జరిపినా ఎలాంటి చర్యలు తీసుకోలేదు. కాళిరాజ్‌ను తొలగించేలా ఆదేశించాలని కోరుతూ మానిక్యం మద్రాస్ హైకోర్టులో కేసు వేశారు. న్యాయమూర్తి శేషసాయి ఫిర్యా దుపై ప్రాథమిక విచారణ జరుపుతున్నామని, విచారణ పూర్తయిన తర్వాత నిర్ణయం తీసుకుంటామని లంచాల నిరోధక శాఖ తెలియజేసింది. దీనిని అంగీకరించిన న్యాయమూర్తి 6నెలల్లోగా ప్రాథమిక విచారణ పూర్తి చేయాలని అవినీతి నిరోధక శాఖను ఆదేశించి కేసును ముగించారు.
ఫుట్‌బాల్ మైదానాలు ప్రైవేటు పరం నిర్ణయం వెనక్కి
సాక్షి, చైన్నె: చైన్నె కార్పొరేషన్ పాలక మండలి సమావేశంలో మంగళవారం చేసిన తీర్మానాలలో ఒకటి తీవ్ర వివాదానికి దారి తీసింది. చైన్నెనగరంలోని తొమ్మిది ఫుట్‌బాల్ మైదానాలను ప్రైవేటు పరం చేయడం దుమారానికి దారి తీసింది. రాష్ట్ర ప్రభుత్వం క్రీడాకారులు, క్రీడలను ప్రోత్సహిస్తున్న నేపథ్యంలో, క్రీడా మైదానాల ఏర్పాటు విస్తృతం చేయాల్సిన సమయంలో ఎలా ప్రైవేటుకు ఫుట్‌బాల్ మైదానాలను అప్పగిస్తారన్న విమర్శలు వ్యక్తమయ్యాయి. కార్పొరేషన్ తీరును పలువురు డీఎంకే, కాంగ్రెస్ సభ్యులు సైతం తప్పుబట్టారు. దీంతో ఈ నిర్ణయాన్ని వెనక్కి తీసుకుంటున్నట్లు, ఆ తీర్మానం రద్దు చేస్తున్నామని బుధవారం కార్పొరేషన్ మేయర్ ప్రియ ప్రకటించారు. ఈ మైదానాల నిర్వహణకు అయ్యేఖర్చు కార్పొరేషన్ భరిస్తుందని ప్రకటించారు.
Comments
Please login to add a commentAdd a comment