హైవే భూ బాధిత రైతులకు అదనపు పరిహారం ఇవ్వాలి
తిరుత్తణి: జాతీయ రహదారికి స్థలం ఇచ్చిన రైతులకు అదనపు పరిహారం కోసం డిసెంబర్ 23న టోల్‌గేట్ ముట్టడించినున్నట్లు రైతులు తెలిపారు. తమిళనాడు రైతు సంఘం ఆధ్వర్యంలో తిరుత్తణి సమీపం కనకమ్మసత్రంలోని కల్యాణ మండపంలో ఆదివారం సాయంత్రం చైన్నె తిరుపతి జాతీయ రహదారికి స్థలం ఇచ్చిన రైతుల సమావేశం నిర్వహించారు. జిల్లా చెరుకు రైతుల సంఘం అధ్యక్షుడు శ్రీనాథ్ అధ్యక్షత వహించారు. రైతు సంఘం నాయకులు పెరుమాళ్, జయచంద్రన్ స్వాగతం పలికారు. ఇందులో రైతు సంఘం జిల్లా అధ్యక్షుడు తులసినారాయణన్, జిల్లా కార్యదర్శి సంపత్ మహానాడులో ప్రారంభించి ఉపన్యసించారు. ముఖ్య అతిథిగా ఆ సంఘం రాష్ట్ర అధ్యక్షుడు షణ్ముగం పాల్గొని ప్రసంగించారు. జాతీయ రహదారులు, రైల్వే రోడ్ల కోసం రైతుల నుంచి ప్రభుత్వం స్థలం తీసుకుంటున్న ప్రభుత్వం నష్టపరిహారం చెల్లించడంలో మాత్రం నిర్లక్ష్యంగా వ్యవహరిస్తోందని ఆరోపించారు. ప్రదానంగా చైన్నె– తిరుపతి జాతీయ రహదారికి స్థలం కోల్పోయిన రైతులు అదనపు నష్టపరిహారం కోసం పదేళ్ల నుంచి పోరాడుతున్నా జాతీయ రహదారుల కమిషన్ పట్టించుకోవడం లేదని, జిల్లా కలెక్టర్ జాతీయ రహదారుల కమిషన్‌తో మాట్లాడి న్యాయం చేయాలని లేని పక్షంలో డిసెంబర్ 23న తిరుత్తణి తిరువళ్లూరు జాతీయ రహదారిలోని టోల్‌గేట్ ముట్టడించి ధర్నా చేపట్టనున్నట్లు ఈ మేరకు తీర్మానం ఆమోదించారు. మహానాడులో వందకు మందికి పైగా రైతులు పాల్గొన్నారు.
మహానాడులో మాట్లాడుతున్న రైతు సంఘం రాష్ట్ర అధ్యక్షుడు షణ్ముగం
Comments
Please login to add a commentAdd a comment