● ప్రతిదానికీ రాజకీయ రంగు పులమొద్దని న్యాయమూర్తి హితవు
కొరుక్కుపేట: తమిళనాడు యూనిఫాం వర్క్ స్టాఫ్ సెలక్షన్ బోర్డు చైర్మన్‌గా రిటైర్డ్ డీజీపీ సునీల్ కుమార్ నియామకాన్ని సవాల్ చేస్తూ దాఖలైన ప్రజా ప్రయోజన వ్యాజ్యాన్ని తక్షణమే విచారించేందుకు మద్రాసు హైకోర్టు నిరాకరించింది. వివరాలు.. తమిళనాడు యూనిఫాం రిటైర్డ్ డీజీపీ సునీల్ కుమార్‌ను స్టాఫ్ సెలక్షన్ బోర్డు ఛైర్మన్‌గా నియమిస్తున్నట్లు తమిళనాడు ప్రభుత్వం ఇటీవల ప్రకటించింది. ఈ నేపథ్యంలో సునీల్‌కుమార్ నియామకాన్ని రద్దు చేయాలంటూ అన్నాడీఎంకే అడ్వకేట్ వింగ్ రాష్ట్ర కార్యదర్శి ఐఎస్ ఇన్బదురై మద్రాసు హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. ఈ పిటిషన్‌ను విచారించిన మద్రాసు హైకోర్టు ఈ పిటిషన్‌పై స్పందించాలని కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలను, సునీల్‌కుమార్‌ను ఆదేశించింది. కాగా కేసు లిస్ట్ కానప్పటికీ, పిటిషనర్.. జస్టిస్ వి. భవానీ సుబ్బరాయన్ ముందు అప్పీల్ దాఖలు చేశారు. దీనిపై న్యాయమూర్తి స్పందిస్తూ.. నియమించబడిన వ్యక్తి అనర్హుడైతేనే విచారణకు ఆదేశించగలం. లేకుంటే ప్రభుత్వ విధాన నిర్ణయాల్లో ఎలా జోక్యం చేసుకుంటాం? ప్రతి విషయానికీ రాజకీయ రంగు పులుమకండి అని న్యాయమూర్తి పిటిషనర్‌కు హితవుపలికారు.
Comments
Please login to add a commentAdd a comment