కొరుక్కుపేట: ఆమ్‌స్ట్రాంగ్ హత్య కేసులోఅరెస్టు అయిన ఓ నిందితుడు ఆర్యోగ సమస్యలు కారణంగా స్టాన్లీ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. బహుజన్ సమాజ్‌వాద్ పార్టీ రాష్ట్ర అధ్యక్షుడిగా ఉన్న ఆర్మ్‌స్ట్రాంగ్‌ను గత జూలైలో పెరంపూర్‌లోని ఆయన ఇంటి సమీపంలో ఓ మిస్టరీ ముఠా నరికి చంపింది. ఈ హత్యకు సంబంధించి మొత్తం 26 మందిని అరెస్టు చేశారు. అలాగే అరెస్టయిన రౌడీ తిరువెంకడం పోలీసులతో జరిగిన ఎన్‌కౌంటర్‌లో మరణించాడు. ఇక ఆవడిలోని అంగళ పరమేశ్వరి అమ్మన్ కోవిల్ వీధికి చెందిన సెల్వరాజ్ (50) కూడా ఆర్మ్‌స్ట్రాంగ్ హత్యకేసులో అరెస్ట్ అయిపూందమల్లి జైలులో రిమాండ్‌లో ఉన్నాడు. ఈక్రమంలో సోమవారం సెల్వరాజ్ హఠాత్తుగా అస్వస్థతకు గురయ్యాడు. దీంతో అతన్ని స్టాన్లీ ప్రభుత్వ ఆసుపత్రిలో చేర్పించారు. అక్కడ పోలీసు రక్షణలో సెల్వరాజ్ క్రిమినల్ వార్డులో చికిత్స పొందుతున్నాడు. కిడ్నీలో రాళ్ల సమస్య కారణంగా ఆస్పత్రిలో చేరినట్లు వైద్యులు తెలిపారు.
Comments
Please login to add a commentAdd a comment