● రూ.5 లక్షల నగదు కూడా..
అన్నానగర్: చైన్నెలోని ఆళ్వార్‌పేట కో–ఆపరేటివ్ కాలనీకి చెందిన దినేష్ (43)కు ఆళ్వార్‌పేటలోని సెనాడోప్ రోడ్డులో వెండి వస్తువులు విక్రయించే దుకాణం ఉంది. మంగళవారం ఎప్పటిలాగే దుకాణం తెరవడానికి వెళ్లాడు. అప్పుడు అతనికి షాక్ తగిలింది. దుకాణంలోని సెక్యూరిటీ వాల్ట్ తాళం పగులగొట్టి 10 కిలోల వెండి వస్తువులు, రూ.5 లక్షలు చోరీకి గురయ్యాయి. అదే సమయంలో తేనాంపేట పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశాడు. తన దుకాణంలో ఉద్యోగిగా పనిచేస్తున్న బెంగళూరుకు చెందిన బాబులాల్ అదృశ్యం కావడంతో పోలీసులు గాలింపు చేపట్టారు. విచారణలో వెండి వస్తువులు, నగదును ఉద్యోగి బాబులాల్ అపహరించినట్లు తేలింది. పరారీలో ఉన్న అతడిని పట్టుకునేందుకు ప్రత్యేక బృందాన్ని ఏర్పాటు చేశారు.
Comments
Please login to add a commentAdd a comment