ఇంట్లో మద్యం విక్రయిస్తున్న మహిళ అరెస్ట్
అన్నానగర్: చైన్నె మైలాపూర్ అంబేద్కర్ పాలెం షణ్ముగం పిళ్లై వీధిలోని ఓ ఇంట్లో అక్రమంగా మద్యం విక్రయిస్తున్నట్లు మైలాపూర్ పోలీసులకు పక్కా సమాచారం అందింది. దీంతో పోలీసులు మంగళవారం మారువేషంలో వెళ్లగా.. అక్కడ మద్యం విక్రయిస్తున్న మహిళను పట్టుకున్నారు. విచారణలో ఆ మహిళ పేరు రేవతి (37) అని తేలింది. ఇప్పటికే 6 సార్లు అక్రమంగా మద్యం విక్రయిస్తూ పట్టుబడింది. ఆమెకి సహకరించిన వ్యక్తి మైలాపూర్ శ్రీనివాసన్ రోడ్ ప్రాంతానికి చెందిన అయ్యనార్ (24) అని తెలిసింది. అతడిని కూడా అరెస్టు చేశారు. అయ్యనార్, మెరీనా పోలీస్ స్టేషన్ హిస్టరీ రిజిస్టర్ క్రిమినల్, అతనిపై 6 క్రిమినల్ కేసులు ఉన్నాయని పోలీసులు తెలిపారు. అరెస్టు చేసిన ఇద్దరు నుంచి 450 క్వార్టర్ మద్యం బాటిళ్లను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు.
Comments
Please login to add a commentAdd a comment