లంచం కేసులో వీఏఓ అరెస్ట్
సేలం: కున్నత్తూర్‌లో రూ.10 వేలు లంచం తీసుకున్న గ్రామ నిర్వాహక అధికారిని ఏసీబీ పోలీసులు అరెస్టు చేశారు. తిరుప్పూర్ జిల్లా అవినాశి సమీపంలోని కున్నత్తూర్ పరిధిలోని ఇడయార్‌పాళయానికి చెందిన రైతు మురుగేశన్ (45). ఈయన, తన సోదరులు అందరికి సొంతమైన 35 సెంట్ల భూమి అదే ప్రాంతంలో ఉంది. ఆ భూమి వ్యాల్యువేషన్ చేసి ఇవ్వాలని ఇడయార్‌పాళయం గ్రామ నిర్వాహక కార్యాలయంలో దరఖాస్తు చేసుకున్నారు. అందుకోసం రూ.10 వేల లంచం అడిగాడు. లంచం ఇవ్వడం ఇష్టంలేని మురుగేశన్ తిరుపూర్ జిల్లా ఏసీబీ పోలీసులకు ఫిర్యాదు చేశారు. వారు ఇచ్చిన సూచన మేరకు బుధవారం రసాయనం పూసిన రూ.10 వేల నగదును మురుగేశన్ వీఏఓ విన్సెంట్ త్యాగరాజన్‌కు ఇచ్చాడు. ఆ సమయంలో అక్కడ ఉన్న ఏసీబీ పోలీసులు విన్సెంట్ త్యాగరాజన్‌ను రెడ్ హ్యాండెండ్‌గా పట్టుకుని అరెస్టు చేశారు. అనంతరం కేసు నమోదు చేసి తిరుపూర్ జైలుకు తరలించారు.
వీఏఓ విన్సెంట్ త్యాగరాజన్
Comments
Please login to add a commentAdd a comment