మార్పులు, చేర్పుల కోసం బారులు
వేలూరు: భారత ఎన్నికల కమిషన్ ఆదేశాల మేరకు ఓటర్ల జాబితాలో పేర్లు, చిరునామా వంటి వాటిని మార్పులు, చేర్పులు చేసుకునేందుకు రెండు రోజుల పాటు అవకాశం కల్పించారు. దీంతో వేలూరు జిల్లాలో 30 లక్షల 23, 979 మంది ఓటర్లున్నారు. ఈ జాబితాను జిల్లాలోని 1,681 పోలింగ్ కేంద్రాలతో పాటు తాలుకా కేంద్రాలు, ఆర్‌డీఒ కార్యాలయాల్లోను ప్రజల కోసం ఉంచారు. వీటిలో ఓటర్ల జాబితాలో పేర్లు మార్పులు, చేర్పులు కోసం ప్రత్యేక శిబిరాలను ఈనెల 16, 17వ తేదీలతో పాటు 23, 24వ తేదీల్లో ఆయా పోలింగ్ కేంద్రాల్లో చేసుకోవాలని ఎన్నికల కమిషన్ ఆదేశించింది. దీంతో శనివారం ఉదయం వేలూరు జిల్లాలోని 1,681 పోలింగ్ కేంద్రాల్లో ప్రత్యేక ఓటర్ల పేర్లు మార్పులు, చేర్పుల కోసం ప్రత్యేక శిబిరం నిర్వహించారు. దీంతో వేలూరు సమీపంలోని అలిమేలు మంగాపురంలోని పోలింగ్ కేంద్రంలో జరుగుతున్న ప్రత్యేక శిబిరాన్ని సబ్‌కలెక్టర్ బాలసుబ్రమణియన్ తనిఖీ చేశారు. ఓటర్ల జాబితాలోని పేర్లు పూర్తిగా సంబంధిత పోలింగ్ కేంద్రాల్లో పెడుతున్నామని, వీటిని ప్రజలు సరిచూసుకోవాలన్నారు. ఒకే పేరు పలు చోట్ల ఓటర్ల జాబితాలో ఉంటే కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు. ఆధార్ కార్డు కలిగిన ప్రాంతంలోనే ఓటర్ల జాబితాలో పేరు ఉండాలని తెలిపారు. వీటిని వివిధ రాజకీయ పార్టీల ప్రతినిధులు, గ్రామ పరిపాలన అధికారులు, గ్రామ కార్యదర్శులు పరిశీలించాల్సిన అవసరం ఉందన్నారు. ఇదిలా ఉండగా ఆయా ప్రాంతాల్లోని రాజకీయ పార్టీల ప్రతనిధులు స్థానికంగా జాబితాలో పేర్లు లేని వారి దరఖాస్తులను పూర్తి చేసి ఆయా పోలింగ్ కేంద్రాల్లో అందజేశారు.
Comments
Please login to add a commentAdd a comment