కేజీ కండ్రిగ పాఠశాల విద్యార్థుల ప్రతిభ
తిరుత్తణి: కళాత్మక పోటీల్లో కేజీ కండ్రిగ పాఠశాల విద్యార్ధులు ఉత్తమ ప్రతిభ కనబరచి రాష్ట్రస్థాయి పోటీలకు ఎంపికయ్యారు. రాష్ట్ర ప్రభుత్వం విద్యార్థుల్లోని ప్రత్యేక ప్రతిభను గుర్తించి వారిని ప్రోత్సహించే విధంగా కళాత్మక పోటీలు నిర్వహిస్తోంది. పాఠశాల, మండల, జిల్లా స్థాయిలో పోటీలు చేపట్టి చివరగా రాష్ట్ర స్థాయి పోటీలు చేపడుతారు. ఇందులో భాగంగా ఈనెల 11, 12 వ తేదీల్లో తిరువళ్లూరు జిల్లా స్థాయిలో పాఠశాల విద్యార్థులకు పోటీలు నిర్వహించారు. ఈ పోటీల్లో తిరుత్తణి సమీపం కేజీ.కండ్రిగ ప్రభుత్వ మహోన్నత పాఠశాల 9,10 వ తరగతి విద్యార్థులు వీధినాటకం విభాగంలో జిల్లా స్థాయిలో తొలిస్థానం సాధించారు. అలాగే అదే పాఠశాలకు చెందిన 11, 12వ తరగతి విద్యార్థులు పరైమేళం సంగీతంలో మొదటి స్థానం కై వసం చేసుకున్నారు. వారు డిసెంబర్ 5, 6 వ తేదీల్లో ఈరోడ్డు, నామక్కల్ జిల్లాల్లో జరుగనున్న రాష్ట్ర పోటీల్లో పాల్గొననున్నారు. గ్రామీణ ప్రాంతంలోని పాఠశాల విద్యార్థులు రాష్ట్రస్థాయి పోటీలకు ఎంపిక కావడంతో కేజీ.కండ్రిగ విద్యార్థులను జిల్లా ఉన్నత విద్యాశాఖ అధికారి రవిచంద్రన్ ప్రోత్సహించి శుభాకాంక్షలు తెలిపారు. అలాగే శనివారం పాఠశాలలో రాష్ట్రస్థాయి పోటీలకు ఎంపికై న విద్యార్థులను హెచ్‌ఎం దామోదరన్ ఆధ్వర్యంలో అభినందించారు.
Comments
Please login to add a commentAdd a comment