సబ్వే నిర్మాణంపై పరిశీలన
తిరువళ్లూరు: పది గ్రామాల ప్రజల ఆకాంక్ష మేరకు సబ్వే నిర్మాణం చేపట్టడంపై అధికారులతో కలసి కలెక్టర్ డాక్టర్ ప్రభుశంకర్ మూలకరై ప్రాంతాన్ని పరిశీలించారు. తిరువళ్లూరు జిల్లా వెళ్లియూర్ సమీపంలోని మేలానూర్ క్రాస్ రోడ్డు నుంచి మెయ్యూరు, రాజాపాళ్యం, వేంబేడు, చిత్తంబాక్కం, ఎరయూర్, మన్నవేడు సహా పది గ్రామాలకు చెందిన ప్రజలు రాకపోకలు సాగిస్తున్నారు. ఈ ప్రాంతంలో ఎన్నూరు నుంచి మహాబలిపురం వరకు మొదటి దశ రోడ్డు నిర్మాణ పనులు సాగుతున్నాయి. ఈక్రమంలో ప్రస్తుత రోడ్డును మూసివేసి మరో ప్రాంతంలో సబ్వే నిర్మాణం చేయాలని అధికారులు నిర్ణయించారు. అయితే అధికారులు తీసుకున్న నిర్ణయం వల్ల పది గ్రామాలకు చెందిన ప్రజలు రోడ్డు దాటడానికి అదనపు ప్రయాణం చేయాల్సి వస్తుంది. తమకు పాతరోడ్డు వున్న ప్రాంతంలోనే సబ్వే నిర్మించాలని డిమాండ్ చేస్తూ కలెక్టర్కు వినతి పత్రం సమర్పించారు. కలెక్టర్ తమ సమస్యలను పరిస్కరించని పక్షంలో ఆందోళన చేస్తామని హెచ్చరించారు. ఈనేపథ్యంలో మూలకరై వద్ద కలెక్టర్ డాక్టర్ ప్రభుశంకర్, ఎల్అండ్టీ నిర్వాహకులు పరిశీలించారు.
Comments
Please login to add a commentAdd a comment