ఐఐటీ మద్రాసు కార్బన్ జీరో ఛాలెంజ్
కొరుక్కుపేట: ఐఐటీ –మద్రాసు, థేల్స్ సంయుక్త నిర్వహణలో కార్బన్ జీరో ఛాలెంజ్ (సీజెడ్‌సీ 4.0)పోటీల్లో పర్యావరణ అనుకూల సాంకేతికతను అభివృద్ధి చేసిన ఆరు జట్లు అగ్రస్థానంలో నిలిచినట్లు ఐఐటీ మద్రాసు కార్బన్ ఛాలెంజ్ కో– ఆర్డినేటర్ ప్రోఫెసర్ ఇందుమతి నంబి తెలిపారు . ఈ సందర్భంగా బుధవారం జరిగిన కార్యక్రమంలో ఆయన మాట్లాడుతూ ఇండియన్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ –మద్రాస్ (ఐఐటీ– మద్రాస్), థేల్స్‌తో విద్యార్థులను వినూత్న ఆవిష్కరణవైపు ప్రోత్సహించేలా దేశవ్యాప్తంగా కార్బన్ జీరో ఛాలెంజ్ (సీజెడ్‌సీ 4.0) ని నిర్వహించారు. ఈ పోటీలకు దేశవ్యాప్తంగా 775 యూనివర్సిటీలు, 430 స్టార్టప్స్ నుంచి 2000 మంది ఉత్సాహంగా పాల్గొన్నాయని తెలిపారు. ఈ ఛాలెంజ్‌లో 6 టీమ్‌లు అగ్రస్థానంలో నిలిచాయని అన్నారు. ఈ సందర్భంగా ఆరు టీమ్‌లను ఘనంగా సత్కరించారు. పర్యావరణ అనుకూల సాంకేతికతను అభివృద్ధి చేసిన మొదటి 6 టీమ్‌లకు రూ.10 లక్షల వరకు స్టార్టప్ సీడ్ ఫండింగ్‌ను అందుకుంటారని తెలిపారు. అనంతరం థేల్స్ – ఇండిమా వైస్ ప్రెసిడెంట్ ఆశీష్ సరాఫ్ మాట్లాడుతూ ఐఐటీ మద్రాసుతో కలసి థేల్స్ కార్బన్ జీరో ఛాలెంజ్ నిర్వహించడం గర్వంగా ఉందన్నారు. పచ్చటి ప్రపంచాన్ని పెంపొందించడంలో తాము దీర్ఘకాలిన నిబద్ధతకు అనుగుణంగా ముందుకెళ్తున్నట్లు తెలిపారు.
Comments
Please login to add a commentAdd a comment