ఫుట్‌బాల్ క్రీడాకారుడికి మోకాలి మార్పిడి శస్త్రచికిత్
సాక్షి, చైన్నె: విదేశీ పుట్‌బాల్ క్రీడాకారుడికి చైన్నె అడయార్‌లోని ఎంజీఎం మలర్ ఆస్పత్రిలో మోకాలి మార్పిడి శస్త్ర చికిత్స జరిగింది. అత్యాధునిక విధానంలో అరుదైన ఈ శస్త్ర చికిత్సను నిర్వహించారు. ఈ వివరాలను బుధవారం ప్రకటించారు. కొలంబియా పుట్ బాల్ క్రీడాకారుడిగాపేరు గడించి పస్తుతం ఆ జట్టు మేనేజర్‌గా ఉన్న రిచర్డ్ తోవా గత ఆరు నెలలుగా భరించలేని మోకాళ్ల నొప్పులతో బాధ పడుతూ వచ్చారు. ఇటీవల ఎంజీఎం హెల్త్‌కేర్ మలర్ అడయార్‌ను ఆయన సందర్శించారు. కుడి మోకాలిలో ఉన్న సమస్యను గుర్తించి సమగ్ర పరిశోధనలతో తక్షణ శస్త్రచికిత్సకు నిర్ణయించారు. ఈ నెల రెండవ వారంలో ఆయనకు మోకాలి మార్పిడి శస్త్ర చికిత్సను విజయవంతంగా చైన్నె వైద్యులు నిర్వహించారు. ఫుట్‌బాల్ ఆటగాళ్లలో సాధారణమైన ఆరోగ్య సమస్యలలో ఒకటైనా ఇలాంటలి సమస్యతో మోకాళ్లకు గణనీయమైన ప్రమాదాన్ని ఎదుర్కోవాల్సి ఉంటుంద ని డాక్టర్ నందకుమార్ సుందరం తెలిపారు. రిచర్డ్ తోవా విషయంలో అధునాతన గ్రేడ్ ఐవీ ఆస్టియో ఆర్థరైటిస్ గణనీయమైన నొప్పి ఈ సమస్యకు దారి తీసి నట్లు వివరించారు. ఇన్వాసివ్ టెక్నిక్‌ని ఉపయోగించి ఈ శస్త్ర చికిత్స ప్రక్రియ జరిగినట్లు తెలిపారు.
Comments
Please login to add a commentAdd a comment