ప్రజలతో స్నేహపూర్వకంగా మెలగాలి
వేలూరు: పోలీసులు ప్రజలతో స్నేహభావంతో మెలగాలని డీఐజీ దేవరాణి అన్నారు. తమిళనాడు పోలీస్ రిక్రూట్‌మెంట్ బోర్డు ఆధ్వద్వర్యంలో రెండవ స్థాయి పోలీస్ కానిస్టేబుల్ పరీక్షలు నిర్వహించారు. వేలూరు జిల్లాలో ఉత్తీర్ణత సాధించిన వారికి ఉద్యోగ నియామక పత్రాలను అభ్యర్థులకు ఎస్పీ మదివాణన్ అధ్యక్షతన బుధవారం ఉదయం అందజేశారు. డీఐజీ ముఖ్య అతిథిగా హాజరై వేలూరు జిల్లాలో ఎంపికై న పోలీస్ కానిస్టేబుల్‌గా 39 మందికి, అగ్నిమాపక శాఖలో 11 మందికి, జైళ్లశాఖలో ఇద్దరికి మొత్తం 52 మందికి ఉద్యోగ నియామక పత్రాలను అందజేశారు. పోలీసులు విధి నిర్వహణలో ఎంతో ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని వీటన్నంటికీ భయాందోళన చెందకుండా నిర్భంయంగా పనిచేసేందుకు సిద్ధంగా ఉండాలన్నారు. కార్యక్రమంలో వేలూరు సెంట్రల్ జైలు సూపరింటెండెంట్ పరశరామన్, అఽగ్నిమాపక శాఖ అధికారి లక్ష్మి నారాయణన్, 15వ బెటాలియన్ ప్రత్యేక కమోండో మణి, అదనపు ఎస్పీ భాస్కరన్ తదితరులున్నారు.
సరిహద్దుల్లో తనిఖీలు మరింత ముమ్మరం
తిరువళ్లూరు: పొరుగు రాష్ట్రాల నుంచి ఎర్రచందనం, గంజాయి అక్రమ రవాణాను అరికట్టడానికి సరిహద్దు చెక్‌పోస్టుల వద్ద తనీఖీలను మరింత ముమ్మరం చేసినట్టు తిరువళ్లూరు ఎస్పీ శ్రీనివాసపెరుమాల్ తెలిపారు. తమిళనాడు పోలీసు రిక్రూట్‌మెంట్ బోర్డు ద్వారా ఇటీవల పరిక్షలను నిర్వహించి ఉద్యోగులను ఎంపిక చేశారు. అనంతరం తిరువల్లూరు జిల్లాకు సెకండరీగ్రేడ్ ఆయుధ విభాగానికి ఐదుగురు, తమిళనాడు స్పెషల్ పోలీసు విభాగానికి 21 మంది, అగ్నిమాపక విభాగానికి 12 మంది, జైలు వార్డెన్ విభాగానికి ఒకరు చొప్పున మొత్తం 39 మందిని కేటాయించారు. జిల్లాకు కేటాయించిన ఉద్యోగులకు నియామక ఉత్తర్వులను ఎస్పీ శ్రీనివాసపెరుమాల్ బుధవారం ఉదయం అందజేశారు. నూతనంగా ఉద్యోగంలో చేరుతున్న యువకులు నిష్పక్షపాతంగా నిజాయితీగా తమ విధులు నిర్వహించాలని ఎస్పీ పిలుపు నిచ్చారు. అనంతరం మీడియా సమావేశంలో ఎస్పీ మాట్లాడుతూ జిల్లావ్యాప్తంగా సరిహద్దులో ఉన్న చెక్‌పోస్టుల్లో తనిఖీలు మరింత ముమ్మరం చేసి గంజాయి, ఎర్రచందనం అక్రమ రవాణాకు అడ్డుకట్ట వేస్తున్నట్లు పేర్కొన్నారు. విద్యాసంస్థలు, అధ్యాత్మిక కేంద్రాల వద్ద గంజాయి విక్రయాన్ని సైతం పూర్తిగా నిషేధించినట్లు వెల్లడించారు. ఈ సమావేశంలో పలువురు పోలీసు ఉన్నతాధికారులు పాల్గొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment