విజయ్‌ సేతుపతితో మరోసారి..? | - | Sakshi
Sakshi News home page

విజయ్‌ సేతుపతితో మరోసారి..?

Published Fri, Nov 29 2024 1:51 AM | Last Updated on Fri, Nov 29 2024 1:51 AM

విజయ్‌ సేతుపతితో మరోసారి..?

విజయ్‌ సేతుపతితో మరోసారి..?

తమిళసినిమా: సక్సెస్‌ఫుల్‌ జంట విజయ్‌ సేతుపతి, త్రిష కాంబో రిపీట్‌ కానుందా? అంటే దీనికి కోలీవుడ్‌ వర్గాలు నుంచి అవుననే సమాధానమే వస్తోంది. నటుడు విజయ్‌ సేతుపతి, త్రిష జంటగా నటించిన చిత్రం 96. ప్రేమ్‌ కుమార్‌ దర్శకత్వం వహించిన ఈ చిత్రం 2018లో విడుదలై అనూహ్య విజయాన్ని సాధించింది. స్కూల్‌ డేస్‌ ప్రేమ ఇతివృత్తంతో రూపొందిన 96 చిత్రం నటుడు విజయ్‌ సేతుపతికి ముఖ్యంగా త్రిష కేరీర్‌లో మైలు రాయిగా నిలిచిపోయింది. కాగా అలాంటి చిత్రానికి 6 ఏళ్ల తర్వాత సీక్వెల్‌ రూపొందనుందన్నది తాజా సమాచారం. ఈ చిత్రంలోనూ విజయ్‌ సేతుపతి, త్రిష జంటగా నటించడానికి రెడీ అవుతున్నట్లు తెలిసింది. 96 చిత్రం తర్వాత దర్శకుడు ప్రేమ్‌ కుమార్‌ నటుడు కార్తీ, అరవింద్‌ స్వామి ప్రధాన పాత్రలు పోషించిన మెయ్యళగన్‌ చిత్రాన్ని తెరకెక్కించారు. ఇటీవల విడుదలైన ఈ చిత్రం మంచి విజయాన్ని సాధించింది. దీంతో తాజాగా ఈయన 96 చిత్రానికి సీక్వెల్‌ కథను సిద్ధం చేసినట్లు తెలిసింది. ఈ చిత్రాన్ని డాన్‌ పిక్చర్స్‌ సంస్థ నిర్మించడానికి సన్నాహాలు చేస్తున్నట్లు సమాచారం. ఇందులో నటించే ఇతర నటీనటులు, సాంకేతిక వర్గం వివరాలను త్వరలోనే అధికారికంగా వెల్లడించే అవకాశం ఉందని సమాచారం.కాగా నటుడు విజయ్‌ సేతుపతి ప్రస్తుతం చేతి నిండా చిత్రాలతో బిజీగా ఉన్నారు. మరోపక్క బిగ్‌ బాస్‌ రియాల్టీ షో కు వ్యాఖ్యాతగా వ్యవహరిస్తున్నారు. ఇక చైన్నె బ్యూటీ త్రిష గురించి చెప్పనవసరం లేదు. తమిళం, తెలుగు, మలయాళం భాషల్లో అగ్ర హీరోలకు ఒకే ఒక్క ఆప్షన్‌ గా మారారు.

No comments yet. Be the first to comment!
Add a comment

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement