పాఠశాలల అభివృద్ధికి సహకరించాలి
వేలూరు: ప్రభుత్వ పాఠశాలలో విద్యను అభ్యసించిన పూర్వపు విద్యార్థులు ఆ పాఠశాలల అభివృద్దికి సహకరించాలని చైన్నె పోలీస్ అసిస్టెంట్ కమిషనర్ మహేంద్రన్ అన్నారు. వేలూరు జిల్లా కాట్పాడిలోని కాంగేయనల్లూరు ప్రభుత్వ పాఠశాలలో 1990లో ఫ్లస్–2 పూర్తి చేసిన పూర్వ విద్యార్థులు 34 సంవత్సరాల అనంతరం మొదటిసారిగా కలుసుకున్నారు. అనంతరం ఒక్కొక్కరి అనుభవాలను పంచుకున్నారు. పూర్వ విద్యార్థుల సంఘం అధ్యక్షులు మోహన్, కార్యదర్శి శశికుమార్, కోశాధికారి వెంకటేశన్, జాయింట్ కార్యదర్శి నెడుమారన్‌లు పూర్వపు విద్యార్థుల ఆధ్వర్యంలో పాఠశాలలో రూ. 1.5 లక్షల వ్యయంతో ఏర్పాటు చేసిన తాగునీటి శుద్ధి యంత్రాన్ని విశ్రాంత హెచ్‌ఎం సుబ్రహ్మణ్యం ప్రారంభించారు. ఈ సందర్భంగా సభ్యులు మాట్లాడుతూ చదివిన పాఠశాల అభివృద్ధికి పూర్వ విద్యార్థులు సహాయకాలు అందజేస్తే ప్రభుత్వ పాఠశాలల నాణ్యత కూడా పెరుగుతుందన్నారు. అనంతరం పాఠశాలలోని నిరుపేద విద్యార్థులకు కాట్పాడి హోటల్ ఓనర్స్ అసోషియేషన్ అధ్యక్షులు కేఆర్ రవి అద్యక్షతన రూ. 20 వేలు స్కాలర్‌షిప్‌లను అందజేశారు. కార్యక్రమంలో సింగపూర్ సాప్టవేర్ ఇంజినీర్ కార్తికేయ, వేలూరు కార్పొరేషన్ హెల్త్ ఆఫీసర్ శివకుమార్, వల్లలార్ ఎయిడెడ్ పాఠశాల హెచ్‌ఎం జయంతి, టీచర్ రేవతి, పేరెంట్స్ టీచర్స్ అసోసియేషన్ కార్యదర్శి ఇళంగోవన్, ఆరుముగం, చైన్నె పోలీస్ సబ్ ఇన్సెపెక్టర్ మనోహరన్, పూర్వ విద్యార్థులున్నారు.
Comments
Please login to add a commentAdd a comment