సంక్రాంతి కానుకలకు శ్రీకారం
కర్ణాటక బస్సు– లారీ ఢీ
సీమాన్‌కు వ్యతిరేకంగా నిరసనలు
● ఇంటిముట్టడి ● పెరియార్‌ను కించ పరిచారని ఆగ్రహం
● నలుగురు మృతి
● 45 మంది ఓం శక్తి భక్తులకు గాయాలు
వేలూరు: తమిళనాడులో జరిగిన రోడ్డు ప్రమాదంలో నలుగురు కర్ణాటక వాసులు మరణించారు. వివరాలు.. రాణిపేట జిల్లా సిప్‌కాడు ప్రాంతంలో బుధవారం అర్ధరాత్రి ప్రభుత్వ బస్సు– లారీ ఢీకొన్న ప్రమాదంలో నలుగురు దుర్మరణం చెందగా.. మరో 45 మంది భక్తులకు గాయాలయ్యాయి. కర్ణాటక రాష్ట్రం కోలార్ ప్రాంతానికి చెందిన ఓంశ శక్తి భక్తులు కర్ణాటక ప్రభుత్వ బస్సును అద్దెకు తీసుకొని కాంచీపురం సమీపంలోని మేల్ మరవత్తూరుకు వెళ్లి సొంత గ్రామానికి అదే బస్సులో తిరుగు ప్రయాణమయ్యారు. బస్సు రాణిపేట జిల్లా సిప్‌కాడు సమీపంలోని ఎమరాల్డ్ కంపెనీ వద్ద బుధవారం రాత్రి వస్తున్న సమయంలో ఎదురుగా వెళ్తుతున్న లారీని తప్పించబోయి కోలార్ నుంచి చైన్నెకి కూరగాయలతో వెళ్తున్న లారీని అతివేగంగా ఢీకొంది. ఆ సమయంలో వెనుక వైపున వస్తున్న మరో లారీ బస్సును వెనుక వైపు నుంచి ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో కాయ కూరలు తీసుకెళ్తున్న లారీ బోల్తా పడింది. దీంతో నాలుగు టన్నుల కూరగాయలు రోడ్డుపై చెల్లా చెదరుగా పడ్డాయి. ఈ ప్రమా దంలో బస్సు ముందు భాగం, లారీ ముందు భా గం నుజ్జునుజ్జు అయ్యాయి. అలాగే కర్ణాటక రాష్ట్రం కోలార్ జిల్లా శ్రీనివాసపురానికి చెందిన లారీ డ్రైవర్ మంజునాథ్ (31), క్లీనర్ శంకర (32), లారీలో ఉన్న కార్మికుడు సోమ శేఖర్(30), పిండినగర్‌కు చెందిన వ్యాపారి క్రిష్ణప్ప (65) నలుగురు అక్కడిక్కడే మృతి చెందారు. ఇక బస్సులో ప్రయాణం చేసిన సుమారు 45 మందికి తీవ్ర గాయాలయ్యాయి. స్థానికుల సాయంతో పోలీసులు గా యపడిన వారిని వాలాజ ప్రభుత్వాసుపత్రికి తరలించారు. వీరిలో నాగేష్, శరణ్, నారాయణస్వామి, శశికళ, మునిరత్నమ్మ, సరస్వతి పరిస్థితి విష మంగా ఉండడంతో మెరుగైన చికిత్స కోసం వే లూరు ప్రభుత్వాసుపత్రికి తరలించారు. పోలీసులు ప్రమాద స్థలానికి చేరుకొని మృతదేహాలను పోస్టుమార్టం నిమిత్తం ఆసుపత్రికి తరలించి విచారణ చేస్తున్నారు. ప్రమాద విషయం తెలుసుకున్న కలెక్టర్ చంద్రకళ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న వారిని నేరుగా వెల్లి పరామర్శించి మెరుగైన చికిత్స అందజేయాలని ఆదేశించారు. ఇదిలా ఉండగా లా రీ నుంచి కింద పడిన కాయకూరలను స్థానికులు పోటీ పడి మరీ వాహనాల్లో తీసుకెళ్లడం గమనార్హం.
Comments
Please login to add a commentAdd a comment