కేంద్రం
నిర్ణయం
తమిళనాడులోని విశ్వ విద్యాలయాలలో వైస్ చాన్స్‌లర్‌ల నియామకం విషయంలో యూజీసీ జారీ చేసిన ఉత్తర్వులను వ్యతిరేకిస్తూ దాఖలు చేసిన ఈ తీర్మానంపై సీఎం స్టాలిన్ సుదీర్ఘ ప్రసంగం చేశారు. శ్ఙ్రీవిద్య పేద వాడికి శాపం అంటూ తన ప్రసంగాన్ని మొదలెట్టారు. భారతీ దాసన్ పాడిన పాటను గుర్తు చేస్తూ మళ్లీ విద్యా స్రవంతిని ఆపేందుకు అన్ని విధాలుగా ప్రయత్నాలు కొనసాగుతున్నాయని ఆగ్రహం వ్యక్తం చేశారు. అందరూ చదువుకుంటారు...అందరూ పనికి వెళ్తారు..అందరూ నిలదొక్కుకోవడం ఇష్టం లేని వాళ్లు ఇక్కడ విద్యారంగంలో నిరంతరం అడ్డంకులు సృష్టిస్తున్నారని మండిపడ్డారు. ప్రతి ఒక్కరికి అన్ని రకాల విద్యను అందించే దిశగా రాష్ట్ర ప్రభుత్వం ముందుకెళ్తుంటే, ప్రతి అంశంలోనూ, విషయంలోనూ, పరీక్షలలోనూ కేంద్ర పాలకులు అడ్డుకట్ట వేస్తున్నారని ధ్వజమెత్తారు. నీట్‌కు వ్యతిరేకంగా ఆది నుంచి గళాన్ని వినిపిస్తున్నా, అసెంబ్లీలో తీర్మానాలు చేసి పంపుతున్నా, ఇంత వరకు ఆమోదించడం లేదని విమర్శలు గుప్పించారు. ఈ నీట్ అన్నది ప్రస్తుతం అక్రమాల పుట్టగా మారిందన్నారు.
తీర్మానం
Comments
Please login to add a commentAdd a comment