ఉద్యోగ కల్పనలో ముందంజ
సాక్షి, చైన్నె: రాష్ట్రంలో యువతకు ఉద్యోగ కల్పనలో ప్రభుత్వం విస్తృత కార్యచరణతో ముందుకు సాగుతున్నట్టు డిప్యూటీ సీఎం ఉదయనిధి స్టాలిన్ వ్యాఖ్యానించారు. విద్యుత్ బోర్డులో సర్వీసులో ఉండగానే మరణించిన వారి కుటుంబాలలో వారికి కారుణ్య నియామకాలకింద ఉద్యోగలకు 311 మందిని ఎంపిక చేశారు. వీరికి ఉద్యోగ నియామక ఉత్తర్వుల పంపిణి కార్యక్రమం గురువారం చైన్నెలో జరిగింది. వీరికి డిప్యూటీ సీఎం ఉదయ నిధి స్టాలిన్ నియామక ఉత్తర్వులను అందజేశారు.అలాగే, విద్యుత్ బోర్డులో పదవీ విరమణ పొందిన పెన్షనర్ల ఉపయోగం కోసం కొత్త మొబైల్ ఫోన్ యాప్‌ను ఆవిష్కరించారు. అలాగే, లైఫ్‌టైమ్ సర్టిఫికెట్లను పరిచయం చేస్తూ పంపిణీ చేశారు. ఈసందర్భంగా ఉదయ నిధి స్టాలిన్‌మాట్లాడుతూ, డీఎంకే అధికారంలోకి వచ్చినానంతరం తమిళనాడు ఎలక్ట్రిసిటీ బోర్డులో అనేక మార్పులు జరిగాయని వివరించారు. బలోపేతం దిశగా ప్రత్యేక దృష్టి కేంద్రీకరించామన్నారు. అఖిల భారత స్థాయిలో తమిళనాడులో పెన్షనర్లకు ప్రయోజనం చేకూర్చేందుకు కొత్త మొబైల్ ఫోన్ యాప్‌ను వినూత్న ఫీచర్లతో రూపొందించామన్నారు.పెన్షనర్లకు సంబంధించిన అన్ని ప్రక్రియలు ఈ యాప్ ద్వారా సాగుతాయన్నారు. ఈ యాప్ ద్వారా తమిళనాడు ఎలక్ట్రిసిటీ బోర్డులో సుమారు లక్ష మంది పెన్షనర్లు ప్రయోజనం పొందుతారన్నారు.యాప్‌ప్‌ను ప్రారంభించి, ముగ్గురు పెన్షనర్లకు లైఫ్‌టైమ్ సర్టిఫికెట్లను అందించామన్నారు. ఈకార్యక్రమంలో విద్యుత్‌శాఖమంత్రి సెంథిల్ బాలాజీ, ఎంపీ దయానిధి మారన్, విద్యుత్‌శాఖ కార్యదర్శి బీలా వెంకటేషన్, చైర్మన్ నందకుమార్ తదితరులు పాల్గొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment