సెల్‌ఫోన్లు వినియోగించరాదు
వేలూరు: పరీక్షల్లో అధిక మార్కులు సాధించేందుకు విద్యార్థులు టీవీ, సెల్‌ఫోన్‌లను పూర్తిగా వినియోగించరాదని కలెక్టర్ సుబ్బలక్ష్మి విద్యార్థులకు సూచించారు. వేలూరు జిల్లా కాట్పాడి సమీపంలోని తిరువలం ప్రభుత్వ బాలికల పాఠశాలలో కలెక్టర్ అకస్మికంగా తనిఖీ చేశారు. అనంతరం పది, ప్లస్‌టూ పరీక్షలకు హాజరయ్యే విద్యార్థులను పాఠశాల ప్రాంగణంలోకి రప్పించి బాలికలు దేశాభివృద్ధికి దోహద పడాలని, ఇందుకు విద్యతోనే ఇది సాధ్యమన్నారు. అనంతరం వేలూరు అబ్దుల్లాపురంలోని వృత్తి శిక్షణ కేంద్రంలో అనాథ ఆశ్రమాల్లో ఉంటూ విద్యను అభ్యస్తున్న విద్యార్థులకు పార్ట్ టైమ్ వృత్తి విద్య శిక్షణను ఆమె ప్రారంభించారు. జిల్లా శిశు సంక్షేమ శాఖ అధికారి సుభాషిణి, వృత్తి శిక్షణ కేంద్రం అసిస్టెంట్ డైరెక్టర్ అమరనాథ్ పాల్గొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment