క్లుప్తంగా
పెద్ద ప్రాజెక్టులతో నష్టం తప్పదు
– మంత్రి సుబ్రమణ్యం
కొరుక్కుపేట: కొత్త విమానాశ్రయం నిర్మాణ విషయంలో ముందుకెళుతున్నట్టు రాష్ట్ర మంత్రి సుబ్రహ్మణ్యం తెలిపారు. ఇలాంటి పెద్ద ప్రాజెక్టు విషయంలో చిన్నపాటి నష్టం తప్పదని ఆయన అభిప్రాయపడ్డారు. ఆయన విలేకరులతో మాట్లాడుతూ కొత్త విమానాశ్రయానికి 15 ఏళ్ల క్రితమే ప్లాన్ చేశారు. తమిళనాడు అభివృద్ధికి కేంద్ర ప్రభుత్వం గుదిబండలా ఉందన్నారు. నష్టపరిహారానికి సంబంధించినంత వరకు ఇతర రాష్ట్రాల్లో ఇది అందించే దానికంటే ఎక్కువ బట్వాడా చేస్తానని వాగ్దానం ప్రభుత్వం చేస్తుందని అన్నారు. మంత్రులు స్వయంగా సందర్శించి వ్యవసాయ భూమికి మూడున్నర రెట్లు ఎక్కువ పరిహారం చెల్లిస్తామని హామీ ఇచ్చారు. అలాగే 13 గ్రామాల ప్రజలకు గ్రామీణ పరిసరాలతో పాటు నిర్మాణాలు అందజేస్తామని హామీ ఇచ్చారు.పెద్ద ఎత్తున అభివృద్ధి ప్రాజెక్టులు వచ్చినప్పుడు చిన్న తరహా ప్రభావాలు తప్పవని పేర్కొన్నారు.
బార్బర్ల్లు సమ్మె బాట
– 24న 3.50 లక్షల సెలూన్ల మూత
సేలం: రాష్ట్ర వ్యాప్తంగా వైద్యుల సంక్షేమ సంఘం, బార్బర్ల సంక్షేమ సంఘం రాష్ట్ర యువజన విభాగ కార్యదర్శి ఎస్.కె.రాజా మంగళవారం ఒక ప్రకటన విడుదల చేశారు. అందులో బార్బర్ వృత్తి చేసే కార్మికుల ఆరు డిమాండ్లను పరిష్కరించాలని చైన్నె వళ్లువర్ కోట్ట వద్ద 24వ తేదీ ఉదయం 9 గంటలకు ఆందోళన చేపట్టనున్నట్టు తెలిపారు. ఈ సందర్భంగా రాష్ట్ర వ్యాప్తంగా మూడు లక్షల 50 వేల సెలూన్ దుకాణాల మూసివేయనున్నట్టు తెలిపారు. ఆందోళనను రాష్ట్ర అధ్యక్షుడు నటేశన్ ప్రారంభిస్తారన్నారు. ప్రధాన కార్యదర్శి రాజన్, యువజన విభాగ కార్యదర్శిఎస్.కె.రాజాతోపాటు విడుదలై చిరుత్తైగల్ పార్టీ అధ్యక్షుడు తొల్ తిరుమావళవన్, రాష్ట్ర కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు సెల్వపెరుందగై, తమిళగ వాల్వురిమై పార్టీ అధ్యక్షుడు వేల్ మురుగన్, జవహరుల్లా, పొన్ కుమార్, విక్రమరాజా, వి.ఎన్.కన్నన్ పాల్గొననున్నట్టు ఆయన ప్రకటనలో పేర్కొన్నారు.
డీఎంకే ఎమ్మెల్యే కార్యాలయంలో బ్యాటరీలు చోరీ
తిరువొత్తియూరు: అన్నానగర్ నియోజకవర్గం డీఎంకే ఎమ్మెల్యే కార్యాలయంలో బ్యాటరీలు చోరీ చేసిన ఇద్దరిని పోలీసులు విచారణ చేస్తున్నారు. చైన్నె అన్నానగర్ డీఎంకే శాసనసభ్యుడు ఎంకే మోహన్ కార్యాలయం అమైందకరై పోలీస్ స్టేషన్ సమీపంలో ఉంది. ఇక్కడ సోమవారం రాత్రి కార్యాలయంలో ఉద్యోగులు పని పూర్తయిన తర్వాత తాళం వేసుకుని ఇంటికి వెళ్లారు. ఈ క్రమంలో మంగళవారం ఉదయం ఉద్యోగులు కార్యాలయం వద్దకు వచ్చిన సమయంలో ఎమ్మెల్యే కార్యాలయంలో ఉన్న బ్యాటరీలు గుర్తు తెలియని వ్యక్తులు చోరీ చేసినట్టు గుర్తించారు. దీంతో అన్నానగర్ పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు. నిఘా కెమెరాలలో నమోదైన దృశ్యాలు ఆధారంగా విచారణ చేపట్టిన పోలీసులు మంగళవారం ఉదయం ఇద్దరిని అరెస్టు చేసి ప్రశ్నిస్తున్నారు.
పోలీస్ స్టేషన్ ఎదుట ఆత్మాహుతి
– ఇద్దరి అరెస్ట్
తిరువొత్తియూరు: పోలీస్‌స్టేషన్ ఎదుట ఓ యువకుడు నిప్పటించుకుని ఆత్మహత్యకు పాల్పడ్డాడు. ఆత్మహత్యకు కారణమైన ఇద్దరిని పోలీసులు అరెస్టు చేశారు. చైన్నె పులియంతోపు ప్రాంతానికి చెందిన రాజన్ (30). ఇతను సోమవారం రాత్రి ఆర్కేనగర్ పోలీస్‌స్టేషన్ ఎదుట ఇంటిపై పెట్రోలు పోసుకొని నిప్పు పెట్టుకున్నాడు. ఇందులో తీవ్రంగా గాయపడ్డ అతన్ని కీల్పాక్కం ప్రభుత్వ ఆస్పత్రిలో చేర్చారు. అక్కడ చికిత్స పొందుతూ మంగళవారం సాయంత్రం మృతిచెందాడు. పోలీసుల విచారణలో అతనిపై కొరుక్కుపేటకు చెందిన అరుణ్‌కుమార్, మాధవన్ అనే ఇద్దరు దాడి చేశారని, పోలీసులకు ఫిర్యాదు చేసినా పట్టించుకోలేదని మనస్తాపం చెంది ఆత్మహత్యకు ప్పాడినట్టు తెలిసింది. అరుణ్‌కుమార్, మాధవన్ అనే ఇద్దరిని పోలీసులు అరెస్టు చేశారు.
హత్యకు కుట్ర: ముగ్గురి అరెస్ట్
సేలం: కరూర్‌లో మాజీ ప్రియురాలిని, ఆమె భర్తను హత్య చేయడానికి ప్రియుడు పంపించిన ముగ్గురు కిరాయి గూండాలను పోలీసులు అరెస్టు చేశారు. తిరుచ్చి జిల్లా వైయమ్పట్టి ప్రాంతానికి చెందిన యువతి, శివగంగై జిల్లా కాలైయార్ కోవిల్ సూసైయప్పర్ పట్నంకు చెందిన శివశంకర్ (24) సామాజిక మాధ్యమాల ద్వారా పరిచయమై ప్రేమించుకున్నారు. గత రెండేళ్లుగా వీరిద్దరు అప్పుడప్పుడు కలుసుకుంటుంటారు. అయి తే శివశంకర్ ప్రవర్తన, అలవాట్లు నచ్చలేదని యు వతి, శివశంకర్‌కు దూరమైంది. ఈ స్థితిలో ఆమె కు కరూర్, మేళపాలయంకు చెందిన అజిత్ (22) తో గత 13వ తేదీ వివాహమైంది. ఈ విషయం తెలిసి శివశంకర్ ప్రియురాలిని, ఆమె భర్తను హత్య చేయాలని నిశ్చయించాడు. ఆ మేరకు కిరా యి ముఠాను కరూర్‌కు పంపించాడు. ఈ క్రమంలో కరూర్ తాంతోనిమలై, టోల్‌గేట్ సమీపంలో ఉన్న లాడ్జీలో సోమవారం రాత్రి మారణాయుధాలతో వడివేల్, కిరాయి ముఠాకు చెందిన అతని స్నేహితులు కలిసి గది దీసుకుని ఉన్నట్టు పసు పతి పాళయం పోలీసులకు సమాచారం అందింది. దీంతో వారు ఆ లాడ్జీకి వెళ్లి తనిఖీలు చేశారు. అప్పుడు అక్కడ గదిలో ఉన్న వడివేల్, అతని మి త్రులు కిరాయి ముఠాకు చెందిన ఆనంద్ (38), హరిహరన్ (20) ఉన్నట్టు తెలిసింది. దీంతో పోలీసులు ఆ ముగ్గురిని అరెస్టు చేసి, వారి వద్ద ఉన్న మారణాయుధాలను స్వాధీనం చేసుకున్నారు.
Comments
Please login to add a commentAdd a comment