యువతికి లైంగిక వేధింపులు
– ఉద్యోగిపై పోక్సో కేసు
తిరువొత్తియూరు: చైన్నె ఈస్ట్ కోస్ట్ రోడ్ ఈంచంబాక్కంలోని ప్రసిద్ధ వినోద కేంద్రానికి రోజూ పెద్దసంఖ్యలో పర్యాటకులు వస్తుంటారు. ఈ క్రమంలో ఈనెల 18వ తేదీన అమైందకరై ప్రాంతానికి చెందిన 24 ఏళ్ల యువతి తన బంధువుతో వచ్చారు. ఆ సమయంలో అక్కడ విధులు నిర్వహిస్తున్న చైన్నె పనైయూర్ మీనవ కుప్పానికి చెందిన సురేందర్ (31) యువతిపై లైంగింక వేధింపులకు పాల్పడ్డాడు. దీంతో యువతి భయంతో కేకలు వేశారు. ఈ ఘటన కలకలం రేపింది. దీంతో బాధిత యువతి నీలాంకరై పోలీసులకు ఫిర్యాదు చేసింది. ఈ కేసును తిరువాన్మియూర్‌లోని మహిళా పోలీస్ స్టేషన్‌నకు బదిలీ చేశారు. ఇన్‌స్పెక్టర్ రాజేశ్వరి సురేందర్‌ను పోక్సో చట్టం కింద అరెస్ట్ చేసి చెంగల్‌పట్టు కోర్టులో హాజరుపరిచి జైలుకు తరలించారు.
టాస్మాక్ ఉద్యోగికి కత్తి వేటు
– నిందితుల కోసం గాలింపు
తిరువొత్తియూరు: పల్లికరణై రాంనగర్‌లో టాస్మాక్ ఉద్యోగిపై కత్తితో దాడి చేసి ఆటోలో పరారైన ఇద్దరు వ్యక్తుల కోసం పోలీసులు గాలిస్తున్నారు. వివరాలు.. రామనాథపురం జిల్లా భగవతి మంగళానికి చెందిన రాజా (34) చైన్నె పల్లికరనై రాంనగర్‌లోని టాస్మాక్‌లో రెండేళ్లుగా పనిచేస్తున్నారు. సోమవారం రాత్రి 10.30 గంటలకు టాస్మాక్ సమీపంలోని ఓ రెస్టారెంట్‌లో స్నేహితులతో కలిసి భోజనం చేసి బయటకు వచ్చాడు. ఆ సమయంలో అక్కడకి ఆటోలో వచ్చిన ఇద్దరు గుర్తుతెలియని వ్యక్తులు కిందకు దిగి హఠాత్తుగా కత్తులతో రాజా తలపై దాడి చేసి ఆటో ఎక్కి పారిపోయారు. తీవ్రంగా గాయపడిన రాజాను ఇరుగుపొరుగు వారు అదే ప్రాంతంలోని ఓ ప్రైవేట్ ఆస్పత్రిలో చేర్పించారు. అక్కడ అతని వైద్యులు చికిత్స చేస్తున్నారు. దీనిపై సమాచారం అందుకున్న పల్లికరణై పోలీస్ స్టేషనన్ సబ్ ఇన్‌స్పెక్టర్ ఏలుమలై, పోలీసులు ఆస్పత్రికి వెళ్లి రాజా వద్ద విచారణ చేశారు. ఆటోలో వచ్చి దాడి చేసిన వారు ఎవరు అని అంశంపై దర్యాప్తు చేస్తున్నారు.
వృద్ధురాలి నగలు చోరీ
తిరువళ్లూరు: చికిత్స కోసం ప్రభుత్వ వైద్యశాలకు వెళ్లిన వృద్ధురాలిని మోసం చేసి నాలుగు సవర్ల బంగారు నగలను దుండగుడు చోరీ చేశాడు. తిరువళ్లూరు జిల్లా పూండి యూనియన్ కమ్మవారిపాళ్యం ప్రాంతానికి చెందిన చిన్ననాయుడు భార్య రాజీకాంతం(69). ఈమెకు కొద్ది నెలల క్రితం చేతికి గాయమై ప్రభుత్వ వైద్యశాలలో చికిత్స తీసుకుంటోంది. ఈక్రమంలో మంగళవారం ఉదయం 11 గంటలకు రాజీకాంతం వైద్యశాలకు వెళ్లి చిక్సిత తీసుకుని ఒంటి గంటకు ఇంటికి వెల్లడానికి బయలుదేరింది. అదే సమయంలో ఆమెను గమనించిన వ్యక్తి, సాయం చేసేలా నటించి ఎక్స్‌రే కేంద్రానికి తీసుకెళ్లాడు. అనంతరం వృద్ధురాలి వద్ద వున్న నాలుగు సవర్ల బంగారు చైన్ తీసి ఇచ్చి ఎక్స్‌రేకు వెళ్లాలని నమ్మించి నగలను తీసుకుని ఉడాయించాడు. ఆలస్యంగా మోసపోయిన విషయాన్ని గ్రహించిన వృద్ధురాలు వైద్యశాల ఆవరణలో బోరున విలపించింది. అనంతరం టౌన్ పోలీస్‌స్టేషన్‌కు వెళ్లి ఫిర్యాదు చేసింది. పోలీసులు కేసు దర్యాప్తు చేస్తున్నారు.
లారీని ఢీకొన్న కారు
– యువకుడు దుర్మరణం
సేలం: మదురై జిల్లాలో సోమవారం రాత్రి లారీని కారు ఢీకొన్న ప్రమాదంలో చైన్నెకి చెందిన వ్యాపారవేత్త కుమారుడు దుర్మరణం చెందాడు. చైన్నెకి చెందిన వ్యాపారవేత్త ముత్తుకుమార్. ఈయన తన కుమారు డు, భార్య, బంధువులు సహా ఐదుగురు తూత్తుకుడి సమీపంలో మురుగన్‌కాడు గ్రామంలో జరిగిన ఆల య తిరునాళ్లకు సోమవారం రాత్రి కారులో బయలుదేరారు. కారును చైన్నెకి చెందిన రామజయం నడిపారు. మదురై జిల్లా మేలూరు సమీపంలోని కరుంగాలక్కుడి సాలైలో వెళుతుండగా అదుపుతప్పి ముందు వెళుతున్న లారీని వెనుక నుంచి కారు ఢీకొంది. ఈ ప్రమాదంలో కారులో ప్రయాణిస్తున్న ముత్తుకుమార్ కుమా రుడు భరత్‌ప్రసన్న (18) దుర్మరణం చెందాడు. ము త్తుకుమార్, ఆయన భార్య, బంధువులు, డ్రైవర్‌తోపా టు ఐదుగురు గాయపడ్డారు. గాయపడ్డ వారిని ఆస్పత్రికి తరలించి పోలీసులు కేసు దర్యాప్తు చేస్తున్నారు.
Comments
Please login to add a commentAdd a comment