ఐఐటీలో లాంగ్ – స్టాండింగ్ కనెక్షన్లపై ప్రదర్శన
సాక్షి, చైన్నె: గొప్ప సాంకేతిక సంస్థలు సామాజిక శాస్త్రాలలోకి విస్తరించడం – మానవీయ శాస్త్ర విభాగాలను సృష్టించడం వంటి అంశాలతో ఐఐటీ మద్రాసు హ్యుమానిటీస్ డిపార్ట్‌మెంట్ లాంగ్ స్టాండింగ్ కనెక్షన్‌లపై ప్రదర్శనను ఏర్పాటు చేసింది. ఐఐటీ మద్రాస్‌లోని హెరిటేజ్ సెంటర్‌తో పాటూ ఐఐటీ మద్రాస్ ఆర్కైవ్ దక్షిణాసియాలోని ప్రతిష్టాత్మకమైన మసాచుసెట్స్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ (ఎంఐటీ), ఐఐటీ, దక్షిణాసియా మధ్య 140 సంవత్సరాలకు పైగా ఉన్న దీర్ఘకాల సంబంధాలపై ఈ ప్రదర్శన ద్వారా దృష్టి పెట్టారు. శ్రీసౌత్ ఏషియా – ది ఇన్‌స్టిట్యూట్ – ట్రాన్స్‌ఫార్మేటివ్ కనెక్షన్స్‌శ్రీ పేరుతో ఈ ఎగ్జిబిషన్ ఐఐటీ మద్రాస్ పూర్వ విద్యార్థులతో సహా ప్రముఖ అమెరికన్ విశ్వవిద్యాలయంలో దక్షిణాసియాకు చెందిన విద్యార్థుల పాత్రపై కూడా దృష్టి పెట్టారు. రెండు నెలల పాటు ఈ ప్రదర్శన జరగనుంది. అందరూ దీనిని వీక్షించే అవకాశం కల్పించారు. ఐటీ మంత్రి డాక్టర్ పళనివేల్ త్యాగరాజన్ మంగళవారం సాయంత్రం ఈ ప్రదర్శనను ప్రారంభించారు. దక్షిణాసియా పూర్వ విద్యార్థుల సంఘం డాక్టర్ హంస బాలకృష్ణన్, ఎంఐటీ ఇంజినీరింగ్ అసోసియేట్ డీన్ ప్రొఫెసర్ రఘునాథన్ రంగస్వామి, ఐఐటీ మద్రాసు డీన్ (గ్లోబల్ ఎంగేజ్‌మెంట్), డాక్టర్ మాతంగి కృష్ణమూర్తి, ఆంత్రోపాలజీ అసోసియేట్ ప్రొఫెసర్ ఆఫ్ పొన్నరసు తదితరులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment