సముచిత స్థానం కల్పించాలి
– బీఎస్పీ నేతల వినతి
తిరువళ్లూరు: రిపబ్లిక్ దినోత్సవంలో జాతీయ జెండాతో పాటు డాక్టర్ అంబేడ్కర్ చిత్రపటానికి నివాళులర్పించేలా కలెక్టర్ ఆదేశాలు ఇవ్వాలని కోరుతూ బీఎస్పీ నేతలు వినతి పత్రం ఇచ్చారు. రిపబ్లిక్ దినోత్సవాన్ని జిల్లా వ్యాప్తంగా జనవరి 26న ఘనంగా నిర్వహించుకోవడానికి ఏర్పాట్లను ముమ్మరం చేస్తున్నారు. ప్రభుత్వ ప్రయివేటు కార్యాలయాలు, విద్యాసంస్థలు, పరిశ్రమలతోపాటు ఇతర ప్రాంతాల్లో జాతీయ జెండాను ఎగులవేయనున్నారు. ఇదేసమయంలో జాతీయ జెండాకు గౌరవ వందనం చేయడంతో పాటు అంబేడ్కర్ చిత్రపటాన్ని వుంచి ఆయన త్యాగాలను స్మరించుకునేలా ఆదేశాలు ఇవ్వాలని కోరుతూ కలెక్టర్ డాక్టర్ ప్రభుశంకర్‌కు బీఎస్పీ నేత ప్రేమ్ ఆధ్వర్యంలో వినతి పత్రం సమర్పించారు.
Comments
Please login to add a commentAdd a comment