సమస్యలు పరిష్కరించాలని రాస్తారోకో
రాస్తారోకో చేస్తున్న దివ్యాంగులు
– దివ్యాంగుల అరెస్ట్
వేలూరు: రాష్ట్రంలోని దివ్యాంగుల సమస్యలు పరిష్కరించాలని కోరుతూ తమిళనాడు సంక్షేమ సంఘం ఆధ్వర్యంలో వేలూరులోని ప్రధాన పోస్టల్ కార్యాలయం ఎదుట రాస్తారోకో నిర్వహించారు. ఆ సంఘం జిల్లా అధ్యక్షుడు గోవిందరాజన్ మాట్లాడు తూ ఆంధ్ర రాష్ట్రంలో దివ్యాంగులకు అందజేస్తున్న విధంగా తమిళనాడులోనూ ప్రత్యేక పెన్షన్ పథకాన్ని తీసుకురావాలని డిమాండ్ చేశారు. గ్రామీణ ప్రాంతాల్లోని దివ్యాంగులందరికీ ఉపాధి హామీ పథకంలో పని కల్పించాలని, బ్యాంకు రుణాలు పొందేందుకు ప్రభుత్వ బ్యాంకులకు సిఫారస్సు చేయాలని, గత ఎన్నికల సమయంలో ప్రభుత్వం దివ్యాంగులకు ఇచ్చిన హామీలను అమలు చేయా లని కోరుతూ రాస్తారోకో నిర్వహించారు. విషయం తెలిసి అక్కడికి వెళ్లిన పోలీసులు రాస్తారోకో చేస్తు న్న వారిని అరెస్ట్ చేసి ప్రయివేటు కల్యాణ మండపానికి తరలించి సాయంత్రం విడుదల చేశారు.
Comments
Please login to add a commentAdd a comment