కూలిన రెండంతస్తుల భవనం
– కోవైలో కలకలం
సేలం: రెండంతస్తుల భవనం పేక ముక్కలా కూలిపోవడం కోవైలో సోమవారం రాత్రి కలకలం రేపింది. కోవై సమీపంలో పశ్చిమ కనుమల్లో ఉద్భవిస్తున్న సంగనూర్ జలపాతం తడాగం నుంచి ప్రారంభమై సింగానల్లూర్ కొలను వరకు వుంటుంది. ఈ కాలువ ఆక్రమణలకు గురైంది. ఇక్కడి ఆక్రమణలను తొలగించే పనిలో అధికారులు నిగమ్నమై ఉన్నారు. ఈ స్థితిలో టాటాబాత్ హట్కో కాలనీ అన్నానగర్ ప్రాంతంలో సంగనూర్ కాలువ ఒడ్డున సురేష్ అనే వ్యక్తికి సొంతమైన రెండు అంతస్తుల భవనం ఉంది. గత పది రోజుల క్రితం ఆ భవనం వెనుక వైపున పది అడుగుల దూరం వరకు ఉన్న ఆక్రమణలను తొలగించారు. ఈ స్థితిలో సోమవారం రాత్రి ఆ ఇంట్లో సురేష్, కుటుంబీకులు భోజనం చేస్తుండంగా ఇల్లు ఊగినట్టు వారికి తెలియడంతో హుటాహుటిన బయటకు పరుగులు తీశారు. ఆ తర్వాత కొంత సేపటికి ఆ రెండు అంతస్థుల భవనం ఒక్కసారిగా కూలిపోయింది. ఆ భవనం పక్కన ఉన్న మరో ఇల్లు కూడా కూలింది. అయితే అదృష్టవశాత్తు ఆ సమయంలో ఇళ్లల్లో ఎవరూ లేకపోవడంతో పెనుప్రమాదం తప్పింది.
Comments
Please login to add a commentAdd a comment