సర్టిఫికెట్లు ప్రదానం
రాష్ట్రంలోని 403 ప్రభుత్వ ఆస్పత్రులలో ప్రసూతి సేవలు, శిశు సంరక్షణ, పిల్లల ఆరోగ్య సంరక్షణ తదితర వైద్యపరంగా సేవలలో నాణ్యతా ప్రమాణాలకు గాను కేంద్ర వైద్య శాఖ పరిధిలోని నేషనల్ క్వాలిటీ అష్యురెన్స్ స్టాండర్డ్ (ఎన్‌క్యూఏఎస్) సర్టిఫికెట్లు దక్కాయి. చైన్నె గిండి తమిళనాడు డాక్టర్ ఎంజీఆర్ వైద్య వర్సిటీ ఆడిటోరియంలో మంగళవారం సాయంత్రం జరిగిన కార్యక్రమంలో ఈ సర్టిఫికెట్లను ఆయా ఆస్పత్రులు, సేవలు అందించిన వైద్యులు, నర్సులు తదితరులకు రాష్ట్ర ఆరోగ్యశాఖ మంత్రి ఎం. సుబ్రమణియన్ ప్రదానం చేశారు. కార్యక్రమంలో పార్లమెంట్ సభ్యుడు తమిళచ్చి తంగపాండియన్, ఆరోగ్య శాఖ కార్యదర్శి సుప్రియా సాహూ పాల్గొన్నారు.
– సాక్షి, చైన్నె
Comments
Please login to add a commentAdd a comment