● మణిపూర్ యువతి అరెస్ట్
తిరువొత్తియూరు: చైన్నె, అడయారు తరమని తిరువాన్మయూర్ తదితర ప్రాంతాలలో ఆన్‌లైన్ యాప్ ద్వారా మత్తుమాత్రలు విక్రయాలు జోరుగా సాగుతోంది. కొందరు ఆన్‌లైన్లో మార్గంగా ఆర్డర్ చేసి మాత్రలను ఉపయోగిస్తున్నారని ఈ మాత్రలు వల్ల ఎటువంటి ప్రభావం చూపులేదని దీని గురించి తిరువాన్మయూర్ పోలీసులకు ఫిర్యాదు అందింది. పోలీసులు ఆన్‌లైన్ యాప్‌ను తనిఖీ చేయగా ఓ యువతి ఈ మోసానికి పాల్పడుతున్నట్లు తెలియ వచ్చింది. ఇందులో ఐటీ సంస్థలో పనిచేస్తున్న ఉద్యోగులు మత్తుమాత్రలను తీసి ఉపయోగిస్తున్నారని అది పెయిన్ కిల్లర్ మాత్రలని తెలియ వచ్చింది. పోలీసులు ఆన్‌లైన్ యాప్ ద్వారా మోసం చేస్తున్న యువతిని పట్టుకొని విచారణ చేశారు. విచారణలో మణిపూర్, రాష్ట్రానికి చెందిన వంగలియాన్ సింగ్ (30) అని తెలిసింది. పోలీసులు ఆమెను అరెస్టు చేసి ఆమె వద్ద నుంచి 8,100 పెయిన్ కిల్లర్ మాత్రలను స్వాధీనం చేసుకున్నారు.
Comments
Please login to add a commentAdd a comment