రిటైర్డ్ ఉద్యోగుల ధర్నా
తిరువళ్లూరు: రిటైర్డ్ ఉద్యోగుల న్యాయమైన డిమాండ్లను పరిష్కరించాలని కోరుతూ తమిళనాడు రిటైర్డ్ గవర్నమెంట్ ఎంప్లాయీస్ అసోషి యేషన్ ఆధ్వర్యంలో మంగళవారం ధర్నా నిర్వహించారు. ధర్నాకు సంఘం కోశాధికారి వాసుదేవన్ అధ్యక్షత వహించగా జిల్లా కార్యదర్శి గణేషన్ హాజరై ప్రసంగించారు. గణేషన్ మాట్లాడుతూ కొత్త పింఛన్ పథకాన్ని వెంటనే రద్దు చేయాలని, కరోనా సమయంలో ఆపిన అలవెన్స్‌లను వెంటనే చెల్లించాలని, వైద్యబీమా పథకంలో వు న్న లొసుగులను సరి చేయాలని కోరారు. 70 ఏళ్లు నిండిన పింఛన్ దారులకు 10శాతం, 80 ఏళ్లు నిండిన వారికి 20 శాతం పింఛన్లను పెంచి ఇవ్వాలని డిమాండ్ చేశారు. డిమాండ్లను పరిష్కరించని పక్షంలో తమ పోరాటాన్ని ఉధృతం చేస్తామని హెచ్చరించారు.
ధర్నా నిర్వహిస్తున్న మాజీ ఉద్యోగులు
Comments
Please login to add a commentAdd a comment