రెండు నెలల తర్వాత భక్తులకు దైవానై ఆశీస్సులు
సేలం : తిరుచెందూరు ఆలయ ఏనుగు దైవానై రెండు నెలల తర్వాత భక్తులకు ఆశీస్సులు అందించింది. దీనికి సంబంధించిన వీడియో దృశ్యాలు ఇప్పుడు సామాజిక మాధ్యమాలలో వైరల్ అవుతున్నాయి. తిరుచెందూరు సుబ్ర మణ్య స్వామి ఆలయ నిర్వాహకులు ఏనుగు దైవానై (26)ను పర్యవేక్షిస్తున్నారు. గత నవంబర్ 18వ తేది దైవానై దాని మావటి ఉదయకుమార్, అతని బంధువు శిశుపాలన్‌పై దాడికి పాల్పడడంతో ఉదయకుమార్ మృతి చెందిన విషయం తెలిసిందే. అప్పటి నుంచి ఆలయ ఏనుగు దైవానైను ఒంటరిగా ఉంచి అటవీ శాఖ అధికారులు, వైద్యులు కలిసి దానికి వైద్యం అందించి పర్యవేక్షిస్తూ వచ్చారు. ఈ స్థితిలో కోలుకున్న దైవానైను గత పది రోజులుగా వాక్కింగ్‌కు తీసుకువెళుతూ వచ్చారు. ఈ క్రమంలో మంగళవారం దైవానై ఆలయానికి వచ్చిన భక్తులను ఆశీర్వదించింది. ఈ దృశ్యాలు సామాజిక మాధ్యమాలలో వైరల్ అవుతున్నాయి.
Comments
Please login to add a commentAdd a comment