మరో పులి మృతితో కలకలం
అన్నానగర్: తెన్‌కాసి జిల్లా సెంగోట్టై సమీపంలోని అచ్చన్ కోవిల్ పక్కనే ఉన్న కల్లార్ ప్రాంతంలో అటవీ శాఖ మంగళవారం పెట్రోలింగ్ నిర్వహిస్తోంది. ఆ సమయంలో కల్లారు సమీపంలోని అడవిలో మగపులి కుళ్లిపోయిన స్థితి లో పడి ఉండడంతో ఉన్నతాధికారులకు సమాచారం అందించారు. చనిపోయిన పులి కళేబరాన్ని వెటర్నరీ వైద్యుల బృందం పరిశీలించింది. మృతి చెందినది 13 ఏళ్ల మగపులి అని, వయోభారం కారణంగా చనిపోయి ఉండవచ్చ ని అధికారులు తెలిపారు. అయితే శవపరీక్ష నివేదిక వచ్చిన తర్వాతే పులి మృతికి గల కచ్చితమైన కారణం తెలుస్తుందని వారు తెలిపారు. కాగా ఈనెల 2వ తేదీన అదే ప్రాంతంలో 14 ఏళ్ల ఆడపులి మృతి చెందడం గమనార్హం.
ఉరివేసుకుని యువతి ఆత్మహత్య
అన్నానగర్: జార్ఖండ్‌కు చెందిన ఆర్తు (23) ఈమె తన భర్తతో కలిసి చైన్నెలోని చింతాద్రిపేటలోని గురువప్ప వీధిలో నివసించేది. ఆర్తీ భర్త సైకిలో టీ వ్యాపారం చేస్తుంటాడు. వీరికి 2 సంవత్సరాల కుమార్తె ఉంది. హఠత్తుగా ఆర్తి మంగళవారం ఉదయం తన ఇంట్లో ఉరివేసుకుని ఆత్మహత్య చేసుకుంది. దీనిపై సమాచారం అందుకున్న చింతాద్రిపేట పోలీస్ ఇన్‌స్పెక్టర్ ధనశేఖరన్ ఆధ్వర్యంలో పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని ఆర్తి మృతదేహాన్ని స్వాధీనం చేసుకుని పోస్టుమార్టం నిమిత్తం రాజీవ్‌గాంధీ ప్రభుత్వాసుపత్రికి తరలించారు. ఇంకా, పోలీసులు జరిపిన విచారణలో, ఆర్తి తండ్రి జార్ఖండ్‌లో 3 నెలల క్రితం చనిపోయాడని, అందుకే ఆమె ఒత్తిడికి గురై ఆత్మహత్యకు పాల్పడిందని తేలింది. ఆర్తీకి పెళ్లయి నాలుగేళ్లే కావడంతో ఆర్‌డీఓ విచారణకు ఆదేశించారు.
జంటహత్యల కేసులో ఇద్దరికి జీవిత ఖైదు
అన్నానగర్: నామక్కల్ జిల్లా ఇరుక్కూరుకి చెందిన రైతు సెంథిల్‌కుమార్ (40). ఇతని భార్య సత్య 6వ వార్డు సభ్యురాలిగా ఎన్నికయ్యారు. అదేవిధంగా సుబ్బయ్య పాళెం ప్రాంతానికి చెందిన ఆరుముగం(50) అనే రైతు. ఆయన భార్య రాజమణి 2వ వార్డు మెంబర్‌గా ఎన్నిక య్యారు. 2019 స్థానిక సంస్థల ఎన్నికల్లో రాజమణియం, సత్య ఉపాధ్యక్ష పదవికి పోటీ పడ్డారు. ఈ విషయమై ఇద్దరి మధ్య మనస్పర్థలు వచ్చాయి. ఈ క్రమంలో అదే పంచాయతీలో పారిశుధ్య కార్మికుడిగా పనిచేస్తున్న ఆరుముగం, శరవణన్(44)లు సెంథిల్‌కుమార్‌ను హత్య చేయాలని పథకం వేశారు. దీంతో డిసెంబర్ 30, 2019 రాత్రి సెంథిల్‌కుమార్, అతని స్నేహితుడు త్యాగరాజన్ (35), ఆరుముగం, శరవణన్‌లు పంచాయతీ కౌన్సిల్ కార్యాలయం సమీపంలోని లైబ్రరీ ముందు కూర్చుని మద్యం సేవిస్తున్నారు. ఆ తర్వాత సెంథిల్‌కుమార్, త్యాగరాజన్ తాగిన మద్యంలో ఆరుముగం, శరవణన్ విషం కలిపారు. ఇది తాగిన సెంథిల్‌కుమార్, త్యాగరాజన్ ఇద్దరూ మృతి చెందారు. ఈ జంట హత్యకు సంబంధించి ఆరుముగం, శరవణన్‌ను పోలీసులు అరెస్టు చేశారు. ఈ కేసు విచారణ నామక్కల్ జిల్లా అదనపు కోర్టులో సాగింది. మంగళవారం తుది తీర్పు వెలువడింది. దోషులుగా తేలడంతో ఆరుముగం, శరవణన్‌కు జీవిత ఖైదు విధిస్తూ న్యాయమూర్తి తీర్పు చెప్పారు.
శిశువుకు జన్యులోపం
● చికిత్సకు సాయమందించాలని
కలెక్టర్‌కు దంపతుల విజ్ఞప్తి
అన్నానగర్: కడలూరు జిల్లా కాట్టుమన్నార్ కోవిల్ సమీపంలోని అళగపుత్తూరుకు చెందిన దంపతులు మంగళవారం జిల్లా కలెక్టర్ సీపీ ఆదిత్య సెంథిల్‌కుమార్‌కు వినతిపత్రం సమర్పించారు. అందులో.. తమకు రెండున్నర సంవత్సరాల కుమార్తె ఉందని, ఈనేపథ్యంలో 5 నెలల క్రితం చిదంబరం ప్రభుత్వాసుపత్రిలో 2వ బిడ్డ జన్మించాడని పేర్కొన్నారు. ఆ సమయంలో చిన్నారికి మగ అవయవం, ఆడ జనన అవయవాలతో చిదంబరం ప్రభుత్వాసుపత్రి వైద్యులు చికిత్స నిమిత్తం పుదుచ్చేరిలోని జిప్మర్ ఆస్పత్రికి తరలించారన్నారు. ప్రస్తుతం చిన్నారికి ఆ ఆసుపత్రిలో చికిత్స అందిస్తున్నామని. శిశువు తరచుగా ఊపిరి పీల్చుకునేందుకు ఇబ్బంది పడుతోందని వాటిని సంబంధించిన వైద్య పరికరాలు కొనడానికి తమ వద్ద డబ్బు లేదని, తమ బిడ్డకు సరైన వైద్యం అందించి తోడ్పాటు అందించాలని కోరారు. వినతిపత్రం స్వీకరించిన కలెక్టర్ తగు చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చారు. కాగా జన్యుపరమైన లోపాల కారణంగానే ఇలాంటి పిల్లలు పడుతారని వైద్యులు పేర్కొంటున్నారు.
60 ఏళ్ల మహిళపై బలాత్కారం
● రౌడీ అరెస్ట్
తిరువొత్తియూరు: చైన్నె, పులియంతోపు ప్రాంతంలో 60 ఏళ్ల మహిళను బలాత్కారం చేసిన రౌడీని పోలీసులు అరెస్టు చేశారు. వివరాలు.. చైన్నె పులియంతోపు ప్రాంతానికి చెందిన 60 ఏళ్ల వృద్ధురాలికి భర్త మృతి చెందాడు. ఈమె ఒంటరిగా నివాసం ఉంటోంది. గత 17వ తేదీ ఆమె ఇంటిలో నిద్రపోతున్న సమయంలో అర్ధరాత్రి మద్యం మత్తులో యువకుడు ఒకడు ఇంటిలోకి చొరబడి ఆమైపె బలాత్కారం చేయడానికి యత్నించాడు. వృద్ధురాలు శబ్ధం చేయడంతో అక్కడి నుంచి తప్పించుకొని పారిపోయాడు. దీని గురించి బాధింపబడిన వృద్ధురాలు పులియం తోపు మహిళా పోలీసులకు ఫిర్యాదు చేశారు. పోలీసులు కేసు నమోదుచేసి విచారణ చేపట్టారు. విచారణలో అదే ప్రాంతానికి చెందిన రౌడీ సూర్య (22) మద్యం మత్తులో మహిళ ఇంటిలోకి చొరబడి లైంగిక దాడి చేయడానికి ప్రయత్నించినట్లు తెలిసింది. సూర్య కూలీగా పని చేస్తూ ఉన్నాడు. దీంతో పోలీసులు సూర్యను అరెస్టు చేసి కోర్టులో హాజరు పరిచి జైలుకు తరలించారు.
Comments
Please login to add a commentAdd a comment