రెండవ చిత్రానికి సిద్ధమైన ధరణి రాజేంద్రన్
తమిళసినిమా: చిత్ర పరిశ్రమలో ప్రయోగాత్మక చిత్రాలకు ఎప్పుడు ఆదరణ ఉంటుంది. అలా సినీ ప్రముఖులు,ప్రేక్షకులను ఆకట్టుకున్న చిత్రం యాత్తిశై. ఈ చిత్ర దర్శకుడు ధరణి రాజేంద్రన్. తొలి చిత్రంతోనే మంచి గుర్తింపు పొందిన ఈయన తాజాగా తన రెండవ చిత్రానికి సిద్ధమయ్యారు. ఈ చిత్రాన్ని జెకె ఫిలిమ్స్ ఇంటర్నేషనల్ పతాకంపై జేకే. కమలకన్నన్ నిర్మిస్తున్నారు. యాత్తిశై చిత్రంలో తన నటనతో అందరినీ ఆకట్టుకున్న నటుడు సేయోన్ చిత్రంలో కథానాయకుడిగా నటిస్తున్నారు. విడుదలై చిత్రం ఫ్రేమ్ భవాని శ్రీ నాయకిగా నటిస్తున్న ఇందులో దర్శకుడు సముద్రఖని ప్రధాన పాత్రలో నటిస్తున్నారు. వీరితో పాటూ పలువురు నటీనటులు ముఖ్యపాత్రలు పోషిస్తున్న ఈ చిత్రం పూజా కార్యక్రమాలు సోమవారం చైన్నెలో నిరాడంబరంగా జరిగాయి. ఈ కార్యక్రమంలో శక్తి ఫిలిం ఫ్యాక్టరీ అధినేత, డిస్ట్రిబ్యూటర్ పి. శక్తివేలన్, నిర్మాత జి. ధనుంజయన్, చిత్రా లక్ష్మణన్ మొదలగు పలువురు సినీ ప్రముఖులు పాల్గొని చిత్ర యూనిట్ కు శుభాకాంక్షలు అందించారు. ఈ సందర్భంగా చిత్ర నిర్మాత జే.కమలకన్నన్ మాట్లాడుతూ ఇది తమ తొలి ప్రయత్నం అని పేర్కొన్నారు. చిత్ర పరిశ్రమంలో తాను ఒక భాగం కావాలన్నా ఆసక్తితో చిత్ర నిర్మాణం చేపట్టినట్టు చెప్పారు. యాత్తిశై చిత్రంతో అందరి దృష్టి తనపై తిప్పుకున్న దర్శకుడు ధరణి రాజేంద్రన్‌తో జేకే ఫిలిమ్ ఇంటర్నేషనల్ సంస్థ కలిసి ఈ చిత్రం నిర్మించడం సంతోషకరమన్నారు. మంచి కథా చిత్రాలను నిర్మించడం, ప్రతిభావంతులైన కళాకారులను ప్రోత్సహించాలన్నదే తమ సంస్థ ప్రధాన ఉద్దేశం అని పేర్కొన్నారు. ఈ చిత్ర షూటింగ్ ను ఫిబ్రవరి నెలలో ప్రారంభించనున్నట్లు చెప్పారు.
Comments
Please login to add a commentAdd a comment