సంతానం తాజా చిత్రం డీడీ నెక్ట్స్ లెవెల్
తమిళసినిమా: నటుడు సంతానం ఇంతకుముందు నటించిన సూపర్ హిట్ చిత్రం డీడీ రిటర్న్స్ కాగా దీనికి సీక్వెల్ గా రూపొందుతున్న తాజా చిత్రం డీడీ నెక్ట్స్ లెవెల్. ఈ చిత్రాన్ని నిహారిక ఎంటర్‌టైన్‌మెంట్ సంస్థతో కలిసి నటుడు ఆర్యకు చెందిన ది షో పీపుల్ సంస్థ నిర్మిస్తోంది. కాగా డిడి రిటర్న్స్ చిత్ర దర్శకుడు ప్రేమ్ ఆనంద్ నే ఈ చిత్రానికి దర్శకత్వం చేస్తున్నారు. నటుడు సంతానంతో పాటూ పలువురు ప్రముఖ నటీనటులు నటిస్తున్న ఈ చిత్ర ఫస్ట్ లుక్ పోస్టర్‌ను సంతానం పుట్టినరోజు సందర్భంగా మంగళవారం విడుదల చేశారు. ఈ సందర్భంగా మీడియాకు విడుదల చేసిన దర్శకుడు ప్రేమ్ ఆనంద్ చిత్ర వివరాలను తెలుపుతూ ఇంతకుముందు తాను దర్శకత్వం వహించిన డీడీ రిటర్న్స్ చిత్రం అన్ని వర్గాల వారిని ఆదరించి మంచి విజయాన్ని సాధించిందన్నారు. దానికి సీక్వెల్ కోసం ఏడాది పాటు కథను సిద్ధం చేసినట్లు చెప్పారు. ఈ చిత్రం కూడా ఆబాల గోపాలాన్ని నవ్వుల్లో ముంచెత్తి అలరిస్తుందనే నమ్మకాన్ని వ్యక్తం చేశారు.. అత్యంత భారీ బడ్జెట్లో రూపొందిస్తున్న ఈ చిత్ర కథ ఒక ఆధునిక షిప్ లో మొదలై దీవిలో జరుగుతుందని చెప్పారు. ఈ చిత్రం కోసం భారీ చర్చ్ చేసినట్లు చెప్పారు. ఇది డిడి రిటర్న్స్ చిత్రం కంటే మరింత ఉత్సుకతను, ఉత్సాహాన్ని ప్రేక్షకులకు కలిగిస్తుందని చెప్పా రు. చిత్రాన్ని సమ్మర్ స్పెషల్ గా మే నెలలో విడుదల చేయటానికి సన్నాహాలు చేస్తున్నట్లు దర్శకుడు చెప్పారు. కాగా దీనికి దీపం కుమార్ పది ఛాయాగ్రహణం, ఆఫ్రో సంగీతాన్ని అందిస్తున్నట్లు పేర్కొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment