తిరుపతి–చైన్నె జాతీయ రహదారిపై రాస్తారోకో
రాస్తారోకో చేస్తున్న గ్రామస్తులు
తిరువళ్లూరు: శిరువానూర్ కండ్రిగను తిరువళ్లూరు మున్సిపాలిటీలో విలీనం చేయాలన్న ప్రతిపాదననూ నిరసిస్తూ తిరుపతి–చైన్నె జాతీయ రహాదారిపై మహిళలు రాస్తారోకోకు దిగడంతో ఉద్రిక్తత నెలకొంది. తిరువళ్లూరు మున్సిపాలిటీలో శిరువానూర్, సేలై, ఈకాడు, కాకలూరుతో సహా పది గ్రామాలను విలీనం చేసి గ్రేటర్ మున్సిపాలిటిగా మార్చడానికి ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. అయితే గ్రామాలను మున్సిపాలిటీలో విలీనం చేయాలన్న ప్రతిపాదననూ వెంటనే వెనుక్కి తీసుకోవాలని కోరుతూ స్థానికులు ఆందోళన వ్యక్తం చేస్తున్న విషయం తెలిసిందే. ఇందులో భాగంగానే శిరువానూర్ గ్రామ మహిళలు తిరుపతి–చైన్నె జాతీయ రహదారిపై రాస్తారోకో నిర్వహించారు. తమ గ్రామాలను మున్సిపాలిటిలో విలీనం చేస్తే ఉపాధీ హమీ పనులు కోల్పోయే ప్రమాదం వుందని, పన్నుల భారాన్ని భరించలేమని వాపోయారు. కాగా రాస్తారోకోతో ట్రాఫిక్‌కు అంతరాయం ఏర్పడింది. సంఘటన స్థలానికి వచ్చిన పోలీసులు మహిళలను సముదాయించి ఆందోళనను విరమింపజేశారు.
● గ్రామాలను మున్సిపాలిటీలో విలీనానికి వ్యతిరేకంగా నిరసన
Comments
Please login to add a commentAdd a comment