హైజాక్‌కు కుట్ర | - | Sakshi
Sakshi News home page

హైజాక్‌కు కుట్ర

Published Wed, Jan 22 2025 12:41 AM | Last Updated on Wed, Jan 22 2025 12:41 AM

హైజాక

హైజాక్‌కు కుట్ర

● బీజేపీపై సీఎం స్టాలిన్‌ పరోక్ష విమర్శలు ● పుస్తకాలు సన్మార్గంలో నడిపిస్తాయని వ్యాఖ్య ● శివగంగైలో క్షేత్రస్థాయి పర్యటన ● అళగప్ప వర్సిటీలో తిరువళ్లువర్‌ విగ్రహం ప్రతిష్ట ● బ్రహ్మాండ వలర్‌ తమిళ్‌ గ్రంథాలయం ఆవిష్కరణ
వళ్లువర్‌.. వల్లలార్‌ల

‘వళ్లువర్‌, వల్లలార్‌లు తమిళ భూమిలో సమానత్వం గురించి సందేశాలు ఇచ్చిన మహానుభావులు అని, అయితే వీరి సందేశాలు, కీర్తి ప్రతిష్టలు , ఇంకా చెప్పాలంటే, వారి పేర్లను హైజాక్‌ చేయడానికి ఓ గుంపు అనేక కుట్ర లతో ఇక్కడ కాచుకుని కూర్చుని ఉంది’ అని పరోక్షంగా కేంద్ర ప్రభుత్వం, బీజేపీ వర్గాలను ఉద్దేశించి సీఎం స్టాలిన్‌ విరుచుకుపడ్డారు.

సాక్షి, చైన్నె: క్షేత్రస్థాయి పర్యటనలో భాగంగా శివగంగై జిల్లాకు చైన్నె నుంచి మంగళవారం సీఎం ఎంకే స్టాలిన్‌ వెళ్లారు. బుధవారం కూడా ఇక్కడి సీఎం పర్యటించనున్నారు. జిల్లాకు వచ్చిన సీఎంకు డీఎంకే వర్గాలు బ్రహ్మారథం పట్టాయి. కారైక్కుడిలోని అలగప్ప విశ్వవిద్యాలయం క్యాంపస్‌ జరిగిన కార్యక్రమానికి హాజరయ్యారు. ఇక్కడ కేంద్రమాజీ మంత్రి , ఎంపీ పి. చిదంబరం తన సొంత నిధుల నుంచి రూ.12 కోట్లు ఖర్చుతో నిర్మించిన బ్రహ్మాండ గ్రంథాలయాన్ని ఈ సందర్భంగా స్టాలిన్‌ ప్రారంభించారు. అలాగే పూర్వ విద్యార్థుల నేతృత్వంలో రూ. 5 లక్షలతో ఏర్పాటు చేసిన తిరువళ్లువర్‌ విగ్రహాన్ని ఆవిష్కరించారు. యూనివర్సిటీ కాన్వకేషన్‌ ఆర్ట్‌ గ్యాలరీ సెమినార్‌ హాల్‌కు ‘వీరు కవి అరసర్‌ మునిరాసనార్‌ అరంగం’ అని నామకరణం చేశారు. ముత్తమిళరింజర్‌ కలైంజ్ఞర్‌ శత జయంతి సావనీరును సీఎం ఆవిష్కరంగా అలగప్ప వర్సిటీ వీసీకే రవి అందుకున్నారు. కవి అన్నదాసన్‌ రాసిన గౌరవనీయులైన తమిళనాడు ముఖ్యమంత్రి ఎం.కె.స్టాలిన్‌ పిల్‌లై తమిళ్‌ పుస్తకాన్ని ఈ సందర్భంగా పి. చిదంబరం ఆవిష్కరించగా రవి అందుకున్నారు.

్డతెలియని ఉత్సాహం..

ఈ కార్యక్రమంలో భాగంగా జరిగిన సభలో సీఎం స్టాలిన్‌ మాట్లాడుతూ కారైక్కుడికి గడ్డ మీద అడుగు పెట్టడం తనకు ఎంతో ఆనందంగా ఉందన్నారు. వల్లల్‌ అళగప్పర్‌ విశ్వ విద్యాలయ వేడుక అనగానే తెలియని ఉత్సాహం తనలో వచ్చిందన్నారు. భారతదేశానికి స్వాతంత్య్రం వచ్చినప్పుడు మద్రాసు విశ్వవిద్యాలయం వైస్‌ చాన్స్‌లర్‌గా ఉన్న లక్ష్మణస్వామి మొదలియార్‌ పిలుపుతో ఇక్కడ విద్యాలయం ఏర్పాటుకు తన వంతు సాయానికి సిద్ధం అని అళగప్పర్‌ ప్రకటించిన విషయాన్ని గుర్తు చేశారు. ఉన్నత స్ఫూర్తితో ప్రారంభించిన ఈ విద్యాలయం ఎంతో మందిని ఉన్నత విద్యావంతులుగా తీర్చిదిద్దినట్టు వివరించారు. మరోమాట చెప్పాలంటే, తమిళుల స్వయం సంకల్పానికి ప్రతీక అళగప్పర్‌ జీవించారని అందుకే ఈ విశ్వవిద్యాలయానికి ఆయన పేరును పెట్టడం జరిగిందన్నారు. ఇక్కడ తిరువళ్లువర్‌ విగ్రహం ప్రతిష్టించడం గురించి ప్రస్తావిస్తూ వళ్లువర్‌ సూక్తులు ప్రతి ఒక్కరి జీవితంలో భాగం అని పేర్కొన్నారు. వీటిని సక్రమంగా అనుసరిస్తే తమిళనాడే కాదు, ప్రపంచం కూడా పరిరక్షించ బడుతుందన్నారు. వళ్లువర్‌, వల్లలార్‌లు తమిళ భూమిలో సమానత్వం గురించి సందేశాలు ఇచ్చిన మహానుభావులు అని, అయితే, వీరి సందేశాలు, కీర్తి ప్రతిష్టలు , ఇంకా చెప్పాలంటే, వారి పేర్లను హైజాక్‌ చేయడానికి ఓ గుంపు అనేక కుట్రలతో ఇక్కడ కాచుకుని కూర్చుని ఉందని పరోక్షంగా కేంద్ర ప్రభుత్వం, బీజేపీ వర్గాలను ఉద్దేశించి విరుచుకుపడ్డారు. వీరి కుట్రలను, వ్యూహాలను భగ్నం చేయడానికి ప్రతి తమిళుడు రక్షణ కవచంగామారాలని పిలుపునిచ్చారు. జ్ఞానమే మనల్ని రక్షించే సాధనం అన్న మాట ఈసందర్భంగా గుర్తుకు వస్తున్నదంటూ ఇక్కడ తన తల్లి లక్ష్మి పేరిట చిదంబరం బ్రహ్మాండంగా వలర్‌ తమిళ్‌ గ్రంథాలయం ఏర్పాటు చేయడం అభినందనీయమన్నారు. వాస్తవానికి చిదంబరం ఒక నడిచే గ్రంథాలయం లాంటి వారని, రాజకీయాలు, చరిత్ర, న్యాయశాస్త్రం, ఆర్థికశాస్త్రం, సాహిత్యం అన్ని రంగాలలో లోతైన జ్ఞానంతో కూడు కున్న జ్ఞాన నిధి అని కితాబు ఇచ్చారు. తనకు కానుకల రూపంలో ఇప్పటి వరకు 2.75 లక్షల పుస్తకాలు వచ్చాయని, వాటిని వివిధ గ్రంథాలయాలకు పంపించినట్టు ఈసందర్భంగా వివరించారు.

సన్మార్గంలో నడిపిస్తాయి..

భవిష్యత్‌ తరాలకు నాణ్యమైన విద్య, ఉత్తమమైన సమాజాన్ని అందించడమే కాకుండా, ప్రగతిశీల ఆలోచనను బలోపేతం చేయడానికి ముందుగా ప్రతి ఒక్కరూ చరిత్రను నేర్చుకోవాల్సిన అవసరం ఉందన్నారు. ఇటువంటి గ్రంథాలయాలు, పాఠ్యపుస్తకాలు పునాదిని ఏర్పరుస్తాయని, ఆ పునాదిపై ఏర్పడిన యువత తమిళ సమాజాన్ని సన్మార్గంలో నడిపిస్తారని వ్యాఖ్యలు చేశారు. అందుకే చైన్నె అన్నా సెంటినరీ లైబ్రరీ, మధురై కలైంజ్ఞర్‌ సెంటినరీ లైబ్రరీ, కోయంబత్తూరులో తందై పెరియార్‌ లైబ్రరీలను గుర్తింపు చిహ్నంగా తీర్చిదిద్దామన్నారు. గ్రంథాలయాలు, పాఠ్యపుస్తకాలు, ఆయా పట్టణానికి చిహ్నాలగా భావించాలని, అప్పుడే తమిళ సమాజాని మెరుగుపరిచేందుకు మరింత వీలుంటుందన్నారు. అందుకే తమిళనాడును సుసంపన్నం చేస్తా..! తమిళనాడు విద్యార్థులు, అన్ని రంగాలకు అర్హులైన యువతగా తీర్చిదిద్దుతాం అని తాను పదేపదే చెబుతుంటానని వ్యాఖ్యలు చేశారు.విద్యను ఎవ్వరూ దొంగలించ లేరని, యువత జ్ఞాన సంపదను మెరుగు పరచుకోవాలని పిలుపు నిస్తున్నానని పేర్కొన్నారు. అందుకే తన ప్రభుత్వం విద్యకు ప్రాధాన్యతను ఇస్తూ వస్తున్నదన్నారు. ఉన్నత విద్య అందరికి దరిచేర్చాలన్న కాంక్షతో కార్యక్రమాలు, పథకాలను విస్తృతం చేస్తున్నామన్నారు. గత మూడున్న సంవత్సరాలలో 32 ఆర్ట్స్‌ అండ్‌ సైన్స్‌కళాశాలలనుసైతం ఏర్పాటు చేశామన్నారు. అత్యుత్తమ ఇంజినీరింగ్‌ కళాశాలలు ఉన్న రాష్ట్రంగా తమిళనాడును తీర్చిదిద్దామన్నారు. అత్యుత్తమ 100 ఉన్నత విద్యా సంస్థల జాబితాలో 31 సంస్థలు తమిళనాడుకు చెందినవేనని వివరించారు. రాష్ట్ర ప్రభుత్వం విశ్వవిద్యాలయాలకు అవసరమైన మౌలిక సదుపాయాలు, సౌకర్యాలు కల్పిస్తున్నదన్నారు. అయితే కేంద్ర ప్రభుత్వం దొడ్డిదారిలో వీసీలను నియమించే ప్రయత్నాలు చేస్తున్నదని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ వ్యవహారంలో న్యాయపోరాటంతో సహా వివిధ మార్గలలో నిరసనలకు సిద్ధం అని ప్రకటించారు. రాష్ట్ర విద్య హక్కులు తిరిగి పొందే వరకు చట్టపరమైన పోరాటాలు, రాజకీయ పోరాటాలు కొనసాగుతాయని స్పష్టం చేశారు. విద్యార్థులు మాత్రం చదవండి.. చదవండి.. ఉన్నత విద్య...పరిశోధన విద్య దయచేసి ఏ విద్యనైనా ఎంపిక చేసుకుని చదవాలని, ఇందుకు అండగా తన ప్రభుత్వం ఉంటుందన్నారు. ఇదిలా ఉండగా బుధవారం పలు కార్యక్రమాలలో శివగంగైలో సీఎం పాల్గొనున్నారు. ఇందుకోసం ప్రత్యేక ఏర్పాట్లు జరిగాయి. ఈ కార్యక్రమంలో మంత్రులు తంగం తెన్నరసు, రఘుపతి, పెరియకరుప్పన్‌, సామినాథన్‌, రాజకన్నప్పన్‌, కోవి చెలియన్‌, మెయ్యనాథన్‌, ఎంపీలు చిదంబరం, కార్తీ చిదంబరం, రచయిత వైరముత్తు తదితరులు పాల్గొన్నారు.

ప్రసంగిస్తున్న సీఎం స్టాలిన్‌

No comments yet. Be the first to comment!
Add a comment
హైజాక్‌కు కుట్ర
1
1/3

హైజాక్‌కు కుట్ర

హైజాక్‌కు కుట్ర
2
2/3

హైజాక్‌కు కుట్ర

హైజాక్‌కు కుట్ర
3
3/3

హైజాక్‌కు కుట్ర

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

 
Advertisement