ఇంటింటికీ డీఎంకే పథకాలు
● ప్రజా ప్రయోజనాలే లక్ష్యంగాద్రవిడ మోడల్ పాలన ● విజయాల పర్వం కొనసాగిస్తామని ధీమా ● శివగంగైలో సీఎం స్టాలిన్ వ్యాఖ్యలు
శివగంగైలో పూర్తి చేసిన పనులను ప్రారంభిస్తున్న సీఎం స్టాలిన్
అమావాస్య రోజుల్ని కాదు, ప్రజల ప్రయోజనాలను లెక్క కట్టి పథకాలుగా అమలు చేద్దాం, వారి ఆనందాన్ని లెక్కిద్దాం అని సీఎం స్టాలిన్ వ్యాఖ్యానించారు. పథకాలైనా సరే, ఉద్యమమైనా సరే అన్నీ తమిళనాడు ప్రజల కోసమేనని స్పష్టం చేశారు. రోజూ ఉదయించే సూర్యుడ్ని చూస్తుంటే ఆ ప్రకాశవంతమైన వెలుగులో డీఎంకే పాలన విజయాల పర్వం కొనసాగుతుందన్నదిస్పష్టమవుతోందన్నారు.
లెక్కిద్దాం..
ప్రతిపక్ష నేత చెబుతున్న లెక్కలన్నీ తప్పుల తడక అని వ్యాఖ్యానిస్తూ, డిఎంకే ప్రభుత్వానికి 13 అమావాస్య రోజులే ఉన్నాయని ఎవరో అన్నట్టుందంటూ పరోక్షంగా బీజేపీ అధ్యక్షుడు అన్నామలైను టార్గెట్ చేశారు. అతను చీకట్లో కూర్చుని, అమావాస్యను లె క్కిస్తున్నాడని ఎద్దేవా చేశారు. పర్వాలేదు మనం మాత్రం ప్రజల ప్రయోజనాలను లెక్కకట్టి పథకా లు అమలు చేద్దాం!, ప్రజల ఆనందాన్ని లెక్కిద్దాం! అని వ్యాఖ్యలు చేశారు. రోజూ ఉదయిస్తున్న సూ ర్యుడిని చూస్తుంటే ఆ ప్రకాశవంతమైన వెలుగులో డీఎంకే పాలన కొనసాగుతుంది...పరిపాలించూ అ న్నట్టుగా ఉంటుందన్నారు. తాను ఎల్లప్పుడూ ప్రజ ల కోసం పని చేస్తా! పని చేయిస్తా ! అని స్పష్టం చే శారు. మీ కోసం, మీ సమస్యల కోసం, మీ కోసం ప్రయోజనాల కోసం, అందరి ఇంటికి ద్రవిడ ము న్నేట్ర కళగం ప్రభుత్వం సాధించిన విజయాలు కొ నసాగుతూనే ఉంటాయని, సంక్షేమమైనా, ఉద్యమమైనా ప్రజల కోసమే అని వ్యాఖ్యానించారు. ఈ కా ర్యక్రమంలో మంత్రులు పెరియ కరుప్పన్, రాజ క న్నప్పన్, కోవి చెలియన్, ఎంపీ కార్తీచిదంబరం, శి వగంగై జిల్లా కలెక్టర్ ఆశా అజిత్ తదితరులు పాల్గొన్నారు. ముందుగా జరిగిన మదురై తమిళనాడు ఛాంబర్ ఆఫ్ కామర్స్ అండ్ ఇండస్ట్రీ శత వార్షికోత్సవంలో సీఎం ప్రసంగించారు. మదురైలో జరిగిన ఈ కార్యక్రమంలో మంత్రులు మూరిత పళణి వేల్ త్యాగరాజన్, పెరియకరుప్పన్, ఎంపీ వెంకటేషన్‌లు పాల్గొనగా సీఎం స్టాలిన్ కాన్ఫరెన్స్ ద్వారా ప్రసంగించారు. ఫెడరేషన్ ఆఫ్ మర్చంట్స్ అసోసియేషన్ రాష్ట్ర అధ్యక్షుడు విక్రమ రాజ సూచించిన మేరకు వర్తకుల సమస్యలు పరిష్కరించేందుకు చర్యలు తీసుకుంటానని సీఎం హామీ ఇచ్చారు.
సాక్షి, చైన్నె: క్షేత్రస్థాయి పర్యటనలో భాగంగా రెండవ రోజు శింగంగై జిల్లాలో సీఎం స్టాలిన్ విస్తృతంగా పర్యటించారు. శ్రీలంక తమిళుల పునరావాస శిబిరాన్ని సందర్శించారు. వారి సమస్యలు తెలుసుకున్నారు. అధికారులతో జిల్లా ప్రగతి, పథకాల తీరు తెన్నుల గురించి సమీక్షించారు. అనంతరం జరిగిన ప్రభుత్వ కార్యక్రమంలో రూ.376 కోట్లతో పూర్తి చేసిన 47 పనులను ప్రారంభించారు. మరో 33 కొత్త పనులకు శంకుస్థాపన చేశారు. 53,039 మంది లబ్ధిదారులకు రూ.161 కోట్ల విలువైన ప్రభుత్వ సంక్షేమ పథకాలను అందజేశారు. కొత్తగా ప్రారంభించిన వాటిలో పంచా యతీ కార్యాలయాల భవనాలు, అంగన్‌వాడీ కేంద్రా లు, పంచాయతీ యూనియన్ కార్యాలయాలు, పాఠశాలల భవనాలు, సేవా కేంద్రం భవనాలు, రైతుల కో సం సంత మార్కెట్లు, పోలీసు స్టేషన్ భవనాలు, క్వార్టర్స్‌లు ఉన్నాయి. అలాగే, శంఖుస్థాపన చేసిన వా టిలో ప్రాథమిక ఆరోగ్య కేంద్రం భవనాలు, నీటిపారుదల ప్రాజెక్టుకు, హెల్త్ కాంప్లెక్స్ భవనాలు, రెవె న్యూ, వాణిజ్య పనుల అధికారుల కార్యాలయాలు, సహకార బ్యాంక్ ప్రధాన కార్యాలయం భవనం ఉన్నాయి. అలాగే దివ్యాంగులకు పెట్రోల్ స్కూటర్లు, ట్రైసైకిళ్లు, స్మార్ట్‌ఫోన్లు, మోటారు కుట్టు యంత్రాలు, వీల్‌చైర్లు, వినికిడి పరికరాలు, విద్యార్థులకు స్కాలర్ షిప్‌లు, లబ్ధిదారులకు గృహాలు ఎలక్ట్రానిక్ కుటుంబ కార్డులు, సంక్షేమ సభ్యత్వ కార్డులు, బోర్ వెల్ సబ్సిడీ, మహిళా స్వయం సహాయక బృందాలకు రుణాలు అందజేశారు.
అంతా మీకోసమే..
సంక్షేమ పథకాల పంపిణీ తదుపరి జరిగిన సభలో శివగంగ నేల వీరత్వానికి ప్రతీక అంటూ వీరనారి వేలునాచ్చియార్ ప్రస్తావనతో సీఎం స్టాలిన్ ప్రసంగాన్ని మొదలెట్టారు. మరుదు సోదరుల వీరత్వం, త్యాగాన్ని గుర్తు చేస్తూ తమిళ ప్రాచీన చరిత్రను ప్రపంచానికి చాటిన నేల శివగంగ అనివ్యాఖ్యలు చేశారు. ఈ జిల్లా ప్రగతి కోసం అభివృద్ధి ప్రణాళికను సిద్ధం చే శా మని వివరించారు. ప్రతి పని, ప్రతి పథకం అందరికీ అన్నీ నినాదంతో ద్రావిడ మోడల్ ప్రభుత్వం ప క్కా ప్రణాళికతో ముందుకెళ్తోందన్నారు. ప్రతి కుటుంబంలో ఓ తండ్రిగా, కొడుకుగా, సోదరుడిగా, అవసరమై న సమయంలో సహాయం చేసే బంధువుగా, ఈ ము త్తవేల్ కరుణానిధి స్టాలిన్ ఉన్నాడని వ్యాఖ్యానించారు. గత మూడున్నర సంవత్సరాలలో తన ప్రభు త్వం మహిళలు, విద్యార్ధినీ విద్యార్థుల సంక్షేమాన్ని కాంక్షి స్తూ అమలు చేస్తున్న నగదు ప్రోత్సాహక పథకాలను, అల్పాహార పథకం గురించి ఈ సందర్భంగా గుర్తు చేశారు. శింగంగైలో కలెక్టర్‌తో పాటూ అన్ని ప్రభుత్వ కార్యాలయాల సముదాయంతో రూ. 89 కోట్లతో భవనం నిర్మించబోతున్నామని ప్రకటించా రు. సింగంపునరి, దిండిగల్, కారైకుడి నగరాలకు వెళ్లే వాహనాలు తిరుపత్తూరు నగర ప్రాంతంలోకి ప్రవేశించకుండా రూ. 50 కోట్లతో తిరుపత్తూరులో బైపాస్ రోడ్డు నిర్మిస్తామన్నారు. కారైక్కుడి కార్పొరేషన్ కార్యాలయ భవనం కోసం రూ.30 కోట్లు కేటాయిస్తున్నామన్నారు. క్షేత్రస్థాయి పర్యటనలో ప్రతి జిల్లాలోనూ ఆ జిల్లాకు తానేమి చేశానో, ఏం చేయ బోతున్నానో అన్న వివరాలను స్పష్టంగా ప్రజలముందే ఉంచుతున్నానని గుర్తు చేశారు. గణాంకాలతో సహా వివరాలను తాను ప్రకటిస్తుంటే, దానిని చూసి తట్టుకోలేక కడుపు మంటతో ప్రతిపక్ష నేత విమర్శలు, ఆరోపణలు చేస్తూ వస్తున్నారని ధ్వజమెత్తారు. ఇన్ని వాగ్దానాలన్నీ అమలు చేస్తూ వస్తూంటే ఈర్ష్యతో ఇష్టారాజ్యంగా మాట్లాడుతున్నారని మండి పడ్డారు. 2021 అసెంబ్లీ ఎన్నికల కోసం ద్రవిడ మున్నేట్ర కజగం(డీఎంకే) తరపున చేసిన 505 ఎన్నికల వాగ్దానాలలో 389 విజయవంతంగా అమలు చేశామ న్నారు.
మరో 116 వాగ్దానాలు మాత్రమే అమలు చేయాల్సి ఉందన్నారు. వీటిని తప్పక చేసి చూపిస్తామన్నారు. ప్రభుత్వంలో మొత్తం 34 శాఖలు ఉన్నాయని, ఒక్కో విభాగానికి రెండు లేదా,మూడు ప్రాజెక్టులు ఈ వాగ్దానాలలో ఉన్నాయని వివరించారు. పదేళ్లుగా అధికారంలో ఉన్న అన్నాడీఎంకే ఈ రాష్ట్రంలో ఏం ఒరగ బెట్టిందో ప్రజలందరికీ తెలుసునని విమర్శించారు. తాము అధికారంలోకి రాగానే కేంద్ర ప్రభు త్వం తమిళనాడుపై సవతి తల్లి ప్రేమను చూపించడం మొదలెట్టిందన్నారు. ఢిల్లీలోని పాలకులు తమిళనాట అన్ని వ్యవహారాలపై నిర్లక్ష్యాన్ని ప్రదర్శిస్తున్నారని మండిపడ్డారు. కేంద్ర ప్రభుత్వ పథకాలకు సైతం రాష్ట్రం ప్రభుత్వం ఇక్కడ నిధులు వెచ్చించాల్సిన పరిస్థితి నెలకొందన్నారు. రెండు రోజుల క్రితం ఆర్థిక మంత్రి తంగం తెన్నరసు సమగ్ర వివరాలను వెలువరించారని గుర్తుచేశారు.
Comments
Please login to add a commentAdd a comment