సీమాన్‌కు ఇంటి వద్ద టెన్షన్
సాక్షి, చైన్నె: ద్రవిడ సిద్ధాంతకర్త పెరియార్‌కు వ్యతిరేకంగా నామ్ తమిళర్ కట్చి కన్వీనర్ సీమాన్ చేస్తూ వస్తున్న వ్యాఖ్యలకు వ్యతిరేకంగా బుధవారం ఆయన నివాసాన్ని కొన్ని సంఘాలు ముట్టడించేందుకు యత్నించడం టెన్షన్‌లో పడేసింది. ఆయన ఇంటి వైపుగా వస్తే ఎదురుదాడి చేస్తామని సీమాన్ వర్గీయులు కాచుకుని కూర్చోవడంతో పోలీసులకు ముచ్చెమటలు తప్పలేదు. చివరకు ఆందోళనకారులను పోలీసులు బలవంతంగా అరెస్టు చేశారు. వివరాలు.. నామ్ తమిళర్ కట్చి నేత సీమాన్ తరచూ వివాదాస్పద వ్యాఖ్యలతో సమస్యలను కొని తెచ్చుకుంటున్న విషయం తెలిసిందే. అయితే ఏమాత్రం తగ్గకుండా ఆయన తన దూకుడును ప్రదర్శిస్తూవస్తున్నారు. గతకొద్ది రోజులుగా ద్రవిడ సిద్ధాంతకర్త పెరియార్‌ను ఉద్దేశించి అనుచిత వ్యాఖ్యలు చేయడం మొదలెట్టారు. ద్రవిడ ఉద్యమం, ద్రవిడ రాజకీయాలకు వ్యతిరేకంగా విరుచుకు పడుతున్నారు. దీనిని పెరియర్ మద్దతు దారులు తీవ్రంగా పరిగణించారు. సీమాన్‌కు వ్యతిరేకంగా నిరసనలు కొనసాగిస్తున్నారు. అయినా, సీమాన్ తగ్గడం లేదు. ఆయనకు వ్యతిరేకంగా రాష్ట్రవ్యాప్తంగా దాదాపుగా అన్ని పోలీసు స్టేషన్‌లలో ఫిర్యాదులు చేరాయి. వ్యవహారం హైకోర్టు వరకు చేరడంతో ఆయనపై చర్యలకు న్యాయమూర్తులు ఆదేశించారు. ఈ పరిస్థితుల్లో సీమాన్ తీరును ఖండిస్తూ ఆయన ఇంటి ముట్టడికి తందై పెరియర్ ఇయక్కం, మే 17 ఉద్యమ సంఘం, ద్రవిడర్ విడుదలై కళగంలు నిర్ణయించాయి.
ఉత్కంఠ..
చైన్నె తిరువాన్మీయూరులోని సీమాన్ నివాసాన్ని ముట్టడించేందుకు సుమారు 1000 మందితో పెరియార్ మద్దతు సంఘాలు కదిలాయి. ఈ సమాచారంతో సీమాన్ ఇంటిని రక్షించుకుంటామని, ఇంటి వైపుగా వస్తే తాము సైతం ప్రతి ఘటిస్తామన్నట్టుగా నామ్ తమిళర్ కట్చి వర్గాలు, మహిళా బృందాలు సిద్ధమయ్యాయి. సీమాన్ ఇంటి వద్ద రక్షణగా వారు నిలవడంతో ఉత్కంఠ నెలకొంది. ఓ వైపు సీమాన్ మద్దతుదారులు, మరోవైపు పెరియార్ మద్దతు దా రులను కట్టడి చేయడానికి సుమారు 300 మంది పో లీసులు రంగంలోకి దిగారు. సీమాన్ ఇంటి వైపుగా వెళ్లే మార్గాన్ని మూసివేశారు. నిరసన కారులు అటు వైపుగా చొచ్చుకు రావడంతో వారిని పోలీసులు అడ్డుకున్నారు. దీంతో తోపులాట, వాగ్వివాదాలు తప్పలేదు. సీమాన్ దిష్టిబొమ్మను తగల బెట్టారు. ఆ ఇంటి వైపుగా దూసుకెళ్లడంతో పోలీసులు బలవంతంగా అడ్డుకుని నిరసనకారులను అరెస్టు చేశారు. మంగళవారం రాత్రి నుంచి ఈ పరిసరాలు తీవ్ర టెన్షన్‌లో ఉండగా నిరసనకారుల అరెస్టులతో పరిస్థితి సద్దుమణిగింది. అయినా సీమాన్ ఏమాత్రం తగ్గక పోవడం గమనార్హం. మీడియాతో ఆయన మాట్లాడ తూ, పెరియార్ వ్యతిరేకంగా స్పందించడమే కాకుండా 2026 ఎన్నికల్లో ద్రవిడ రాజకీయాలను అడ్రస్ లేకుండా చేస్తామని హెచ్చరించారు.
ముట్టడికి పలు సంఘాల ప్రయత్నం
ఎదురుదాడికి సిద్ధమైన మద్దతుదారులు
అడ్డుకున్న పోలీసులు – ఉద్రిక్తత
Comments
Please login to add a commentAdd a comment