నకిలీ డాక్టర్ అరెస్టు
తిరువొత్తియూరు: శ్రీపెరంబదూరు సమీపంలో నకిలీ డాక్టర్‌ను పోలీసులు అరెస్టు చేశారు. వివరాలు.. పూందమల్లి సమీపము నజరత్ పేటకు చెందిన చార్లెస్(46). ఇతను శ్రీపెరంబుదూరు సమీపం వలర్‌పురం గ్రామం మాత కోయిల్ వీధిలో క్లినిక్ నడుపుతున్నాడు. ఇతను 10 తరగతి వరకు చదివి సరైన వైద్య కోర్సు చదువుకుండానే వైద్యం చేస్తున్నట్లు ఆరోగ్యశాఖ అధికారులకు ఫిర్యాదులు వచ్చాయి. దీంతో కాంచీపురం జిల్లా ఆరోగ్యశాఖ జాయింట్ డైరెక్టర్ నేతృత్వంలో అధికారులు క్లీనిక్‌లో తనిఖీ చేశారు. ఆ సమయంలో అతను నకిలీ వైద్యుడు అని తెలిసింది. దీని గురించి ఆరోగ్య శాఖ అధికారులు శ్రీపెరంబుదూరు పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఇన్‌స్పెక్టర్ ధర్మలింగం కేసు నమోదు చేసి నకిలీ డాక్టరు చార్లెస్‌ను అరెస్టు చేశారు.
అప్పుల బాధతో హిజ్రా ఆత్మహత్య
తిరువొత్తియూరు: చైన్నె ఎంజీఆర్ నగర్‌లో అప్పుల బాధతో హిజ్రా ఉరి వేసుకుని ఆత్మహత్య చేసుకుంది. చైన్నె ఎంజీఆర్ నగర్ చూలై పల్లం ప్రాంతానికి చెందిన దేవి (43) హిజ్రా. ఈమె అద్దె ఇంట్లో నివాసం ఉంటున్నారు. ఈమె అప్పులు ఎక్కువగా చేయడంతో అప్పు తీర్చలేక ఇబ్బందులు పడుతున్నట్లు తెలిసింది. అదే సమయంలో అప్పు ఇచ్చిన వారు తీవ్రంగా ఒత్తిడి చేశారు. దీంతో మానసిక ఒత్తిడికి గురైన దేవి, తను వుంటున్న గదిలో ఉరివేసుకొని ఆత్మహత్య చేసుకున్నారు. దీని గురించి ఎంజీఆర్ నగర్ పోలీసులు విచారణ చేస్తున్నారు.
సముద్రంలో ఉంగరాలు మార్చుకుని పెళ్లి చేసుకున్న జంట
అన్నానగర్: విమానంలో పెళ్లి సముద్రంలో పడవలో వెళ్లడంతో పాటు రకరకాల పెళ్లిళ్లు మనం చూస్తూనే ఉంటాం. అయితే పుదుచ్చేరిలో లోతైన సముద్రంలో నీటి అడుగున వెళ్లి ఓ జంట విభిన్నంగా పెళ్లి చేసుకున్నారు. వివరాలు.. పుదువై మురుంగాబాక్కం కి చెందిన జాన్ డి బ్రిటో–దీపిక. సముద్ర కాలుష్యంపై అవగాహన, సముద్ర జీవుల రక్షణ అవసరాన్ని నొక్కి చెబుతూ లోతైన సముద్రంలో వివాహం చేసుకోవాలని నిర్ణయించుకున్నారు. అప్పుడు టెంపుల్ అడ్వెంచర్ డీప్ సీ కోచ్ అరవింద్ బుధవారం తోడుగా ఉన్నారు. పుదుచ్చేరి కొబ్బరి తోట నుంచి 5 కి.మీ. దూరంగా సముద్రంలోకి వెళ్లిపోయారు. అక్కడ 50 అడుగుల లోతులో పెళ్లి వేడుక జరిగింది. కొబ్బరి ఆకుల్లో పూలు కట్టి పెళ్లి వేడుకలు నిర్వహించి సముద్రంలో ఉంగరాలు మార్చుకున్నారు. వారితో పాటు ఐదుగురు లోతైన సముద్రంలోకి వెళ్లారు. డీప్ సీ ట్రైనర్ అరవింద్ తెలిపిన వివరాల ప్రకారం నీటి అడుగున పెళ్లి జరగడం ఇదే తొలిసారి. వీరు లోతైన సముద్ర ఈతగాళ్లు కావడంతో ఇబ్బందేమీ లేదు. ఏర్పాట్లతో ముందుకెళ్లి పెళ్లి చేసుకుని ఆదర్శంగా నిలిచామన్నారు.
Comments
Please login to add a commentAdd a comment